●ప్రతి మహిళ సెల్ ఫోన్ లో టి-సేఫ్ యాప్ ఉండాల్సిందే:షీ టీమ్ ఎస్సై సునంద.
●షీ టీమ్స్. టి-సేప్ యాప్ పై అవగాహన సదస్సు.
(నమస్తే మానుకోట న్యూస్-మహబూబాబాద్ కరస్పాండెంట్)
ప్రతి మహిళ సెల్ లో టి సేఫ్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఉండాలని మహబూబాబాద్ షీ టీం ఎస్ఐ సునంద సూచించారు.మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎస్సీ హాస్టల్ లో జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ ఆదేశాలమేరకు అడిషనల్ ఎస్పీ చెన్నయ్య ఆధ్వరంలో మహిళల భద్రత ,రక్షణ పై పోలీసుశాఖ నిర్వహిస్తున్న సేవలపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 'T సేఫ్ యాప్'ను మహిళలు,విద్యార్థినులు ప్రైవేటు వాహనాలలో ప్రయాణిస్తున్నప్పుడు ఎలాంటి ఆపద కలిగినా తక్షణమే ఉపయోగించుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో షీ టీమ్స్ ఏఎస్ఐ ఆనందం, మహిళ కానిస్టేబుల్ అరుణ, పార్వతి.భరోసా సెంటర్ సాహితీ,ఏహెచ్ టి యూ సుప్రజ. హాస్టల్ వార్డెన్ సుజాత మరియు సిబ్బంది పాల్గొన్నారు.
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.


