కలకత్తా హత్యాచార నిందితులను కఠినంగా శిక్షించాలి
-సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ తొర్రూరు డివిజన్ కార్యదర్శి ఊడుగుల లింగన్న.
-దంతాలపల్లి సబ్ డివిజన్ కార్యదర్శి చిర్ర యాకన్న.
-పిడిఎస్యు తొర్రూర్ డివిజన్ కార్యదర్శి గొడిశాల మనోజ్.
(నమస్తే మానుకోట-దంతాలపల్లి):కలకత్తా ఆర్జీకర్ మెడికల్ కళాశాల వైద్య విద్యార్థినిపై జరిగిన హత్యాచారం హత్య ఘటనకు సంఘీభావంగా మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ లో ర్యాలీ నిర్వహించారు.ఘటన జరిగి ఇన్ని రోజులు అవుతున్న నిందితులపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం అనేది అనుమానం కలిగిస్తోందన్నారు,దోషులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని,మహిళలపై జరుగుతున్న అగయిత్యాలను అరికట్టడానికి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలను తేవాలని,ముఖ్యంగా సమాజంలో పెను బూతంగా మారిన డ్రగ్స్ మహమ్మారిని నిర్మూలించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి త్వరితగతిన నిందితులకు ఉరిశిక్ష పడే విధంగా ప్రభుత్వాలు కృషిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఉమేష్,ప్రసాద్,వీరన్న విద్యార్థులు పాల్గొన్నారు.

