Type Here to Get Search Results !

దళితుల భూముల జోలికి వస్తే సహించేది లేదు:గుగ్గిళ్ళ పీరయ్య ఫైర్

◆బీసీ కుల వృత్తుల దేవుళ్లకు దళితుల భూములే కావాలా..మహాజన ◆సోషలిస్ట్ పార్టీ జాతీయ నాయకుడు-గుగ్గిళ్ళ పీరయ్య

(నమస్తే మానుకోట న్యూస్-దంతాలపల్లి)

దంతాలపల్లి  మండలం నిదానపురం గ్రామంలో దళితులు అయినా ఎస్సీ మాదిగలతో మాదిగ మహిళలతో పూర్వం వెట్టి చాకిరి చేపించుకొని దొరలకు ఊడిగం చేసేవారు,కుమ్మరికుంట్ల దొరలు తమ సొంత భూమిని మూడు ఎకరాల 24 గంటలు దానధత్వంగా దళితులకు ఇచ్చారు. అట్టి భూమిని దళితుల్లో కొందరు దళార్లు మరియు బిసి వర్గాల తో కుమ్మక్కై కబ్జా చేయాలని ఆ భూముల్లో బీసీ కులాలకు గుడి గోపురాలు కట్టాలని రాజకీయాలు చేస్తు మాజీ సర్పంచ్ ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించాలని చూస్తున్నారని వారన్నారు. భూములను లాక్కోవాలని అక్రమంగా వారిపై దాడులు చేస్తూ పోలీస్ స్టేషన్లో కేసులు పెడుతూ అమాయకులైన మాదిగలను ఇబ్బందులకు గురి చేస్తున్న వారిని సహించేది లేదని మహాజన సోషలిస్ట్ పార్టీ జాతీయ నాయకుడు గుగ్గిళ్ళ పీరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. మహబూబాబాద్ జిల్లా: దంతాలపల్లి మండలం: నిదానపురం గ్రామంలో దళితుల భూమిని సందర్శించి ఆ భూమిని ఆక్రమించుకున్న విధానాన్ని చూసి చెల్లించిన జాతీయ నాయకుడు గుగ్గిళ్ల పీరయ్య వారి భూములను కొంతమంది అదే కులానికి చెందిన దళారులు బీసీలకు కొమ్ము కాస్తూ దళితుల భూమిని కబ్జా చేయాలని చూస్తున్నారని అన్నారు. దళితుల భూమి జోలికి వస్తే రణరంగమేనని మందకృష్ణ మాదిగా నాయకత్వంలో అనేక ఉద్యమాలకు పూనుకుంటామని ఆయన హెచ్చరించారు. మన వాడు మోసం చేస్తే మన ఇంటి ముందే పాతిపెడదాం పరాయివాడు మోసం చేస్తే పొలిమర దాటిదామని కాళోజి నారాయణరావు  చెప్పిన సూక్తిని తెలియజేస్తూ దళితుల జోలికి వస్తే సహించేది లేదని దళితుల భూముల జోలికొస్తే ఊరుకునేది లేదని అవసరమైతే కలెక్టర్ ని కూడా కలుస్తామని ఇక్కడున్న ఎస్ఐ  కూడా అక్రమంగా కేసులు పెడితే సహించబోమని సరి అయిన విచారణ జరిపించి కేసుల్లో ముందుకు పోవాలి గాని అక్రమంగా వన్ సైడ్ కేసులు పెడితే సహించబోమని మాదిగ వర్గాలను కూడా ఏకం చేసి జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు చాగంటి రమేష్ ప్రధాన కార్యదర్శి ఇరుగు రవి, రజియా, వంగూరి వెంకటేశ్వర్లు ,చేలగళ్ల వెంకన్న, కందిపాటి భిక్షం, రామరాజు, పద్మ ,సుమిత్ర ,మధు ,వెంకన్న  ,నరేష్ తదితరులు పాల్గొన్నారు.




Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.