◆'రుణమాఫీ'పై....అధైర్య పడొద్దు...!
◆వ్యవసాయ శాఖ మండల అధికారిణి పి.వాహిని.
(నమస్తే మానుకోట-దంతాలపల్లి)
మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో మండల వ్యవసాయ అధికారి పి వాహిని పత్రిక విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, దంతాలపల్లి మండల పరిధిలోని గ్రామాల రైతులకు ఇప్పటివరకు రెండు లక్షల లోపు ఉన్న రైతు కుటుంబాలకు రుణమాఫీ జరిగిందని,రెండు లక్షల లోపు ఉన్న రైతు కుటుంబాలు(ఒక రేషన్ కార్డు కి )రుణమాఫీ జరగని వారు ఎవరైనా ఉంటే సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారులను సంప్రదించాలని ఆమె అన్నారు.రెండు లక్షల పైన ఉన్న అన్నదాతల కుటుంబాలకు తదుపరి విడతల్లో రుణమాఫీ జరుగుతుందని అన్నారు. కావున అన్నదాతలు అధైర్య పడవద్దని వారు సూచించారు.ఈ కార్యక్రమంలో ఏ ఈ ఓ లు దీక్షిత్,ఉదయ్,శిరీష మండల పరిధిలోని రైతులు తదితరులు పాల్గొన్నారు.

