నమస్తే మానుకోట న్యూస్ మహబూబాబాద్
ఆపరేషన్ ముస్కాన్- X పోస్టర్ ను ఆవిష్కరించిన జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్
బాల కార్మిక వ్యవస్థ సమూల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ భాద్యతగా వ్యవహారించాలి
చిన్నారుల మొహంలో చిరునవ్వులు చిందించేలా చేద్దాం నిస్సహాయత లేని చిరునవ్వులే మన లక్ష్యం
బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరు సహకరించాలి.
చిన్న పిల్లల్ని ఎవరైనా వెట్టిచాకిరి గురి చేస్తే వారిపై క్రిమినల్ కేసులు నమోదు
బాలల ఉజ్వల భవిష్యత్తు నిర్మాణంలో సమాజంలోని ప్రతిఒక్కరు భాగస్వామ్యం కావాలి సమన్వయంతో పనిచేసి చిన్నారులను బాల్యాన్ని కాపాడుదాం
జిల్లా ఎస్సీ సుధీర్ రాంనాధ్ కేకన్
బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్ పదవ విడుత కార్యక్రమం జూలై 1 నుండి 31వ తారీఖు వరకు జిల్లాలో పటిష్టమైన ప్రణాళికతో అమలు చేయడం జరుగుతుందని జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ తెలిపారు.
ఈ సందర్భంగా ఈ రోజు ఆపరేషన్ ముస్కాన్-X అధికారులు మరియు సిబ్బందితో కలిసి ఎస్పీ కార్యాలయంలో పోస్టర్ ను ఆవిష్కరించారు.బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి ప్రతీ సబ్ డివిజన్ పరిధిలో ఒక ఎస్ఐ మరియు నలుగురు సిబ్బందిని ఒక బృందంగా నియమిచడం జరిగిందని తెలిపారు.పోలీసులు శాఖతో పాటు ఇతర శాఖలా అధికారులతో కలిసి సంయుక్తంగా దాడులు నిర్వహించాలని సూచించారు.జిల్లా వ్యాప్తంగా 02 ప్రత్యేక బృందాలు ఈ నెల రోజులపాటు ఆపరేషన్ ముస్కాన్-Xలో భాగంగా బాలకార్మికులను గుర్తించడానికి దాడులు నిర్వహిస్తారని తెలియజేసారు.ఎక్కడైనా బాలకార్మికులను గుర్తిస్తే వెంటనే 1098 లేదా డయల్ 100 లేదా స్థానిక పోలీస్ అధికారులకు సమాచారం అందించాలని
ఈ సందర్బంగా ఎస్పీ విజ్ఞప్తి చేశారు.
అనంతరం జిల్లా ఎస్పీ ఆదేశాలతో డిఎస్పీ గండ్రతి మోహన్ ఆధ్వర్యంలో ఆపరేషన్ ముస్కాన్-X బృందాలలో నియమింపబడిన పోలీస్ అధికారులు,సిబ్బంది మరియు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ,లేబర్ డిపార్ట్మెంట్,ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, చైల్డ్ ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్,హెల్త్ డిపార్ట్మెంట్ మరియు వివిధ డిపార్ట్మెంట్ అధికారులతో పోలీస్ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది.
జిల్లాలో పలు హాట్ స్పాట్స్ ను గుర్తించి అక్కడ ప్రత్యేకంగా నిఘా ఉంచాలని ఈ సందర్బంగా డిఎస్పీ మోహన్ ముస్కాన్ అధికారులకు సూచించారు.గతంలో ఆపరేషన్ ముస్కాన్ ద్వారా రెస్క్యూ చేసిన పిల్లల యొక్క ప్రస్తుతం పరిస్థితి గురించి తెలుసుకోవాలని అన్నారు.బడికి వెళ్లకుండా చదువు మానేసి పనులు చేస్తున్న పిల్లలను గుర్తించి వారిని మరలా స్కూల్లో చేర్పించి విద్యావంతులుగా తీర్చిదిద్దాలని తెలిపారు.కిరాణషాపులలో,మెకానిక్ షాపులలో,హోటళ్లలో,ఇటుక బట్టీలలో,పౌల్ట్రీ ఫామ్ లలో,రోడ్డుపై భిక్షాటన చేస్తున్న పిల్లలు మరియు ఇతర ప్రదేశాలలో తప్పిపోయిన,వదిలివేయబడిన పిల్లలు బాలకార్మికులుగా పని చేస్తున్నట్లయితే అలాంటి వారిని గుర్తించి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి వారికి అప్పగించడం,లేదా వారిని సంరక్షణా గృహాలకు తరలించేలా చర్యలు తీసుకోవాలన్నారు
చిన్న పిల్లలతో ఎవరైనా బలవంతంగా బిక్షాటన మరియు వెట్టి చాకిరీ చేయిస్తున్నట్లు దృష్టికి వస్తే వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు.
ఈ సమావేశంలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఛైర్పర్సన్ డా. నాగవాణి, DWO వరలక్ష్మి, CWC మెంబర్ డేవిడ్, dy DMHO అంబరీష్, లేబర్ కమీషనర్ జగదీష్, లేబర్ ఆఫీసర్ రమేష్, DEO రామారావు, బాల రక్షా భవన్ కోర్డినేటర్ లక్ష్మి, డీసీపీవో వీరన్న, నరేష్, చైల్డ్ లైన్ కోర్డినేటర్ వెంకటేష్, కళ్యాణి, వసుంధర, ప్రభు, అనిల్, సీసీఎస్ సీఐ చంద్రమౌళి, DCRB సీఐ సత్యనారాయణ, CCS ఎస్.ఐ ఉమా,మరియు ఇతర అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు

