◆ ఖమ్మం వరంగల్ హైవే పై ఘోర రోడ్డు ప్రమాదం.
◆ ఆటోను ఢీకొట్టిన కారు...నుజ్జునుజ్జయిన ఆటో.
◆ అక్కడికక్కడే ముగ్గురు మృతి... పరిస్థితి విషమం.
◆ సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద తీరును పరిశీలించిన జిల్లా ఎస్పీ.
(నమస్తే మానుకోట-దంతాలపల్లి)
మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండల కేంద్ర శివారులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది.ఖమ్మం-వరంగల్ ప్రధాన రహదారి పై చారి తండా క్రాస్ రోడ్డు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఖమ్మం వైపు నుంచి వస్తున్న కారు తొర్రూర్ వైపు నుండి వెళ్తున్న ప్రయాణికుల ఆటోను అతివేగంతో ఢీ కొట్టింది.దీంతో ఆటో రోడ్డు ప్రక్కనే ఉన్న చెట్టుకు ఢీకొంది.ఈ ప్రమాదంలో ఆటో నుజ్జు నుజ్జు కాగా ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురు ప్రయాణికులలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్ర గాయాలపాలైన మరో ముగ్గురిని స్థానిక పోలీసులు హుటాహుటిన హాస్పిటల్ కి తరలించారు.కాగా విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ రాంనాథ్ కేకన్ సంఘటనాస్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

