నమస్తే మానుకోట న్యూస్ మహబూబాబాద్
గ్రీవెన్స్ దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అధికారులను ఆదేశించారు.
సోమవారం రోజున ఐ.డి.ఓ.సి. సమావేశ మందిరంలో నిర్వహించిన గ్రీవెన్స్ లో జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అదనపు కలెక్టర్ లోకల్ బాడీ లెనిన్ వత్సల్ టోప్పో, జడ్పీ సీఈవో నర్మద గార్లతో కలిసి ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించారు.
ఈ రోజు నిర్వహించిన గ్రీవెన్స్ లో (161) దరఖాస్తులు వివిధ సమస్యల పైన వచ్చాయి. అందులో వ్యవసాయ శాఖ, డిఆర్డిఓ, జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ సంక్షేమ శాఖ నుంచి అధికంగా దరఖాస్తులు వచ్చాయని, గ్రీవెన్స్ దరఖాస్తులను పరిశీలించి సమస్యలను త్వరగా పరిష్కరించాలని సంబంధిత జిల్లా అధికారులను ఆదేశించారు.
ప్రజావాణి లో స్వీకరించిన దరఖాస్తులను పరిశీలించి అర్హత మేరకు సమస్యలు పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులకు ఎండర్స్ చేయడం జరిగింది.
సమస్యల పై వచ్చిన దరఖాస్తులను పరిష్కరించేందుకు విలున్న దరఖాస్తులను. త్వరగా పరిష్కరించి, పరిష్కరించుటకు వీలు లేని దరఖాస్తులను సంబంధిత దరఖాస్తు దారునికి వివరించాలని సంబంధిత జిల్లా అధికారులను ఆదేశించారు.
ఈ గ్రీవెన్స్ లో సంబంధిత జిల్లా అధికారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.


