ఉస్మానియా యూనివర్సిటిలో జరుగుతున్న నిరుద్యోగ నిరసనలో ఓయూ పోలీసుల అత్యుత్సాహం పట్ల తెలంగాణ ప్రదేశ్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు డి. వై. గిరి, ప్రధాన కార్యదర్శి ఎం. శివ కుమార్ లు విచారం వ్యక్తం చేశారు. పోలీస్ లాఠీ దెబ్బలకు నిరసనకారులతో పాటు జర్నలిస్ట్ లపై లాఠీ ఛార్జ్ చేయడం పట్ల యూనియన్ ఆందోళన వ్యక్తం చేస్తుంది. జర్నలిస్ట్ అని చెప్పినప్పటికీ ఓయూలో పోలీసులు చేసిన చర్యలు దుర్మార్గ కుట్రపూరిత వాతావరణం తలపిస్తుందని వారు అన్నారు. ప్రభుత్వం వైపు నుండి ఏ కఠిన ఆదేశాలు లేకున్న గత ప్రభుత్వపు ఆనవాళ్లు ఉన్న పోలీసు అధికారులు కావాలని తమ సిబ్బందిని లాఠీ ఛార్జికి పురామాయించినట్లు కనబడుతుందని అటువంటి అధికారులు తమ తప్పుడు విధానాలు మార్చుకోవాలని వారు డిమాండ్ చేశారు. లాఠీ దెబ్బలకు సొమ్మసిల్లి పడిపోయిన జీ న్యూస్ రిపోర్టర్ శ్రీ చరణ్ కి కనీసం చికిత్స చేపించకుండా రోడ్డుపై వదిలేసి వెళ్లిన పోలీస్ చర్యలను రాష్ట్ర యూనియన్ ప్రభుత్వం పెద్దల దృష్టికి తీసుకుపోతుందని, ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా రాష్ట్ర తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని, గత ప్రభుత్వపు అన్నావాళ్లు ఉండి ఇటువంటి చర్యలకు పూనుకుంటున్న అధికారులను గుర్తించి వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని యూనియన్ డిమాండ్ చేస్తుందని డి. వై. గిరి, శివ కుమార్ లు అన్నారు.ఓయూ ఘటనలో గాయాలపాలైన జర్నలిస్ట్ లకు చికిత్సతోపాటు రిపోర్టర్ శ్రీ చరణ్ కి పరిహారం ఇవ్వాలని తెలంగాణ ప్రదేశ్ జర్నలిస్ట్ యూనియన్ డిమాండ్ చేస్తుంది. జర్నలిస్ట్ లు సైతం విధి నిర్వాహణలో గుర్తింపు కార్డులు మెడలో ధరించాలని, నిరసనలో జర్నలిస్ట్ లు జాగ్రత్తలు పాటించాలని యూనియన్ కోరుతుంది.
ఉస్మానియాలో జర్నలిస్ట్ లపై దాడి అమానుషం:డి.వై గిరి
July 11, 2024
0
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

