Type Here to Get Search Results !

మీడియా మరియు పోలీస్ శాఖ సమన్వయం తో పని చేయాలి జెర్నలిస్టులకు పూర్తి సహాయాసహకారాలు అందిస్తాం. ప్రజలకు, పోలీసులకు మధ్య వారధి మీడియా జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్

 నమస్తే మానుకోట న్యూస్ మహబూబాబాద్

మహబూబాబాద్ జిల్లా ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులతో మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ సమావేశం అయ్యారు.

ఈ సమావేశం లో ముఖ్యంగా మహబూబాబాద్ జిల్లా లో లా అండ్ ఆర్డర్ సమస్యలు , అసంఘిక కార్యకలాపాలు, గంజాయి, గుట్కా, గుడుంబా, బెల్లం లాంటి అక్రమ రవాణా అరికట్టడం, రోడ్డు ప్రమాదల నివారణకు చర్యలు, మైనర్స్ రాష్ డ్రైవింగ్, నెంబర్ ప్లేట్ లేకుండా వాహనం నడపడం, గంజాయి మత్తులో యువత, భూ దందాలు, ఆందోళనలకు గురిచేసే రౌడీ షీటర్ల పై చర్యలు, లని పలు అంశాలపై చర్చించడం జరిగింది.

మీడియా సహాయాసహకారాలతో ప్రజలలో అవగాహనా కల్గించి మార్పు తీసుకొని రావచ్చని ఎస్పీ అన్నారు.

ప్రజలకు పోలీసులకు మధ్య వారధి గా మీడియా వ్యవస్థ పని చేయాలనీ అన్నారు.అ

అలానే జిల్లా ఎస్పీ మీడియా నుండి కొన్ని సలహాలు, సూచనలు స్వీకరించారు

త్వరలోనే మీడియా మరియు పోలిస్ మధ్య ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ నిర్వహించాలని ఎస్పీ కోరారు.

మీడియా తో స్నేహపూర్వ వాతావరణంలో సమావేశం ఏర్పాటు చేసిన జిల్లా ఎస్పీకి ధన్యవాదాలు తెలిపారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.