నమస్తే మానుకోట న్యూస్
ప్రజా సమస్యలు పరిష్కరించడానికి కమ్యూనిస్టుల పోరాటాలే మార్గ నిర్దేశం అని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి నల్లు సుధాకర్ రెడ్డి అన్నారు.
సిపిఐ చిన్న గూడూరు మండల కార్యవర్గ సమావేశం గుండం రాజు పెళ్లి గ్రామంలో జరగగా ముఖ్యఅతిథిగా పాల్గొన్న సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో మును పెన్నడు లేనివిధంగా దేశంలో ఆర్థిక అసమానతలు తీవ్రంగా పెరిగిపోయాయని మోడీ అవలంబించిన కార్పొరేట్ అనుకూల విధానాలతో దేశ సంపద కారు చౌకగా కట్టబెట్టడమే కారణమని తీవ్రంగా విమర్శించారు.
నిత్యవసర వస్తువుల ధరలు తీవ్రంగా పెరిగిన నిరుద్యోగ సమస్య మునుపెన్నడూ లేనివిధంగా పెరిగినా, రైతాంగం తీవ్ర సంక్షేమంలో కూకపోయినా పట్టించుకోని ప్రభుత్వాలపై ప్రజా పోరాటాలే మార్గమని అన్నారు
ఈ సమావేశంలో సిపిఐ మండల కార్యదర్శి గంజి శేషాద్రి రెడ్డి, దొంతు స్టాలిన్, పోలేపాక వెంకన్నతదితరులు పాల్గొన్నారు.

