నమస్తే మానుకోట న్యూస్ మహబూబాబాద్
మహబూబాబాద్ జిల్లాకు దాశరథి పేరు పెట్టాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి శంతన్ రామరాజు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సోమవారం నాడు నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో దాశరథి కృష్ణమాచార్యులు జయంతి వేడుకలను ఘనంగా జరిగాయి. నిరుద్యోగ జేఏసీ జిల్లా అధ్యక్షులు కమ్మగాని కృష్ణమూర్తి అధ్యక్షతన జరిగిన ఈవేడుకల్లో శంతన్ రామరాజు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ తెలంగాణ ఔన్నత్యాన్ని చాటారన్నారు. కరవాలం లాంటి తన కలంతో అగ్నిధారలు కురిపించి నైజాం రాజు తెలంగాణకు పట్టిన బూజు అంటూ నైజాం నిరంకుశత్వానికి చమరగీతం పాడిన ధీశాలి దాశరధి అని కొనియడారు. తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొని జైలు జీవితం గడిపి తన జీవితం యావత్తూ ప్రజలకు అంకితం చేసిన గొప్ప వ్యక్తి దాశరథి అని కీర్తించాడు. తెలంగాణ తొలిదశ మలిదశ ఉద్యమానికి ఊపిరులూథిన తన విప్లవ రచనలు తెలంగాణ ప్రజల పోరాట చైతన్యానికి స్ఫూర్తినిచ్చాయన్నారు. అదేవిధంగా తెలుగు చిత్రసీమలో పాటల రచయితగా తనకంటూ ఓ అధ్యాయాన్ని లిఖించుకొని ఈప్రాంత కళాకారులకు ఆదర్శంగా నిలిచాడని అన్నాడు. తన జీవితం యావత్తు ప్రజా జీవితానికి ధారపోసిన దాశరథి కృష్ణమాచార్యులు మన జిల్లా వాసి కావడం మనందరికీ గర్వకారణమన్నారు. 1925 జులై 22న చిన్న గూడూరులో జన్మించిన దాశరథి మానుకోట ఖ్యాతిని ఖండాంతరాలకు చాటిన దాశరథి పేరును జిల్లాకు పెట్టడడమే ఆ మహనీయునికి మనం ఇచ్చే ఘన నివాళి అన్నాడు. ములుగు జిల్లాను సమ్మక్క సారలమ్మ జిల్లాగా పేరు మార్చే యోచనలో ఉన్న ప్రభుత్వం తెలంగాణకు విశిష్ట సేవలందించిన దాశరథిని కూడా గౌరవించాలని ఆకాంక్షించారు. ఆమహనీయుని శతజయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్న ప్రభుత్వం మహబూబాబాద్ జిల్లాకు దాశరధి పేరుపెట్టే దిశగా అడుగులు వేయాలని కోరారు.
నవంబర్ 5, 1987లో దివికేగిన దాశరధి సూర్యచంద్రులున్నంత వరకూ ప్రజల గుండెల్లో నిలిచిపోతారన్నారు.
ఈకార్యక్రమంలో గుంజే హన్మంతు, హరిప్రసాద్, రఘు, వీరన్న, ఉపేందర్, సురేంద్రనాధ్, కపిలయ్య, శ్యామ్, గంగాధరి బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

