నమస్తే మానుకోట న్యూస్ మహబూబాబాద్
మానవాళి మనుగడకు చెట్లే జీవనాధారం అని మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి శంతన్ రామరాజు అన్నారు.
ఆదివారం నాడు స్థానిక సబ్ జైలులో వనమహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. జైలర్ మల్లెల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వనమహోత్సవంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న శంతన్ రామరాజు మాట్లాడుతూ మానవ తప్పిదాలతో రోజురోజుకూ పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోందని అన్నారు. ఋతువులు తారుమార్తె ఆతివృష్టి, అనావృష్టితో వాతావరణంలో తీవ్ర మార్పులు చోటు చేసుకుంటున్నాయన్నారు. సరైన సమయంలో వర్షాలు రాకపోవడం, ఎడారిలో తుఫాన్లు రావడం వంటి అసంబద్ధ పరిస్థితులు నెలకొన్నాయన్నారు. మన అభివృద్ధి విధ్వంసంతో ఉష్ణోగ్రతలు పెరిగి మంచు పర్వతాలు కరిగిపోతున్నాయన్నారు. ఓజోన్ పొర దెబ్బతినడంతో పాటు ఎక్కడికక్కడ అడవుల నరికివేత ఈ పరిస్థితులకు ముఖ్య కారణమన్నారు. ఏదేమైనా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వనమహోత్సవం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఈసందర్భంగా జైలు లోపల, బైట పచ్చదన పరిమళంతో జైలును నందనవనంగా తీర్చిదిద్దిన జైలు సిబ్బందిని అభినందించారు.
ఈకార్యక్రమంలో జైలు అధికారులు డిప్యూటీ జైలర్ పట్టేం భిక్షపతి, సదానిరంజన్, బోడ వెంకన్న, గోగుల రాజు, చీర వెంకన్న, వాలాద్రి జైపాల్, మురళి, కొండి సాయికుమార్ నేత, రాజు తదితరులు పాల్గొన్నారు.

