నమస్తే మానుకోట న్యూస్ నర్సింహులపేట
అకాల మరణం చెందిన స్నేహితుని కుటుంబానికి చిన్ననాటి స్నేహితులు అండగా నిలిచారు.
నర్సింహులపేట మండలంలోని లోక్య తండా గ్రామపంచాయతీ శివారు పాండ్య తండాకు చెందిన గుగులోతు సుదర్శన్ పది రోజుల క్రితం మరణించారు. వృత్తిరీత్యా వ్యవసాయ కూలీ అయిన తనకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే..
తమతో పాటు చదువుకున్న స్నేహితుడు మరణం పట్ల తోటి స్నేహితులు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.
చిన్న వయసులోనే తమని వదిలి వెళ్ళటాన్ని జీర్ణించుకోలేకపోయారు
వివిధ వృత్తి వ్యాపరాలలో ఉన్నవారు కలిసి 25 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని ఆ కుటుంబానికి అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు
కష్ట కాలంలో సహాయం అందించిన10వ తరగతి బ్యాచ్ స్నేహితులను గ్రామస్తులు,బంధువులు అభినందించారు.
ఈ కార్యక్రమంలో 10వ తరగతి స్నేహితులు దోమల యాదగిరి, గుగులోతు తిరుపతి, భారి లక్ష్మీనర్సు, పొన్నం సురేష్, రావుల యాకయ్య, కొండ్రెడ్డి కరుణాకర్ రెడ్డి, కొంపెల్లి నరేష్, ఆకుతోట నరేష్, కొండబత్తిని కిరణ్, నిమ్మల నరేష్, పొన్నం శ్రీకాంత్, భారి రమేష్, శంకర్, జంపయ్య, యాకయ్య తదితరులు ఉన్నారు

