Type Here to Get Search Results !

శాంతి భద్రత పరిరక్షణ ధ్యేయంగా ప్రతి ఒక్క పోలీసు అధికారి పనిచేయాలి జిల్లా ఎస్సీ సుధీర్ రాంనాధ్ కేకన్

 నమస్తే మానుకోట న్యూస్ మహబూబాబాద్ 



డయల్ 100 కాల్స్ కి తక్షణమే స్పందించి వెంటనే సంఘటనా స్థలానికి చేరుకోవాలి


శాంతిభద్రత పరిరక్షణ ద్యేయంగా ప్రతీ ఒక్కరి పని చేయాలి


పెండింగ్ కేసులు త్వరితగతిన పూర్తి చేయాలి


సైబర్ మోసాల పై ప్రజలకు అవగాహన కల్పించాలి


ఇన్వెస్టగేషన్ పూర్తి ఆధారాలతో పారదర్శకతతో చేసి నేరస్తులకు శిక్ష పడే విధంగా పనిచేయాలి


జిల్లా ఎస్సీ రాంనాధ్ కేకన్



మహబూబాబాద్ జిల్లా పరిధి పోలీస్ అధికారులతో మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ UI కేసులు, గ్రేవ్ UI లాంగ్ పెండింగ్‌లో కేసుల పరిష్కారం, SC/ST UI కేసులు, ఉమెన్ ఎగైనెస్ట్ కేసులు, POCSO కేసుల పరిష్కారం, గుడుంబా,NDPS యాక్ట్ కేసుల, NHRC, SHRC మరియు సైబర్ క్రైమ్, షీ టీమ్స్, అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది.

ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ..... అండర్ ఇన్వెస్టిగేషన్లో ఉన్న కేసులను త్వరగా డిస్పోజల్ చేయాలన్నారు. పోక్సో, ఎస్సీ, ఎస్టీ గ్రేవ్ కేసుల్లో త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేయాలన్నారు. ప్రతి కేసులో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ ఉండడంతో పాటు పూర్తి పారదర్శకంగా కేసును ఇన్వెస్టిగేషన్ చేయాలన్నారు. ప్రతి సిడి ఫైల్ ను, అందులో ఉన్న డాక్యుమెంట్స్ ను పరిశీలించి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయాలని, పెండింగ్ ఉన్న సిసి నెంబర్లు తీసుకోవాలన్నారు. ప్రతి ఫైల్ లో ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రకారం సిడి ఫైల్ పొందుపరచాలని, నేర చేదన కంటే, నేర నివారణ చాలా ముఖ్యమని తెలిపారు. శాంతిభద్రతల సంరక్షణలో అలసత్వానికి తావివ్వొద్దని, పోలీస్ స్టేషన్ లలో బాధితులు ఇచ్చే ఫిర్యాదుల ఆధారంగా ఎంక్వైరీ చేసి చట్ట పరిధిలో వెంటనే కేసులు నమోదు చేసి వెంటనే సమస్య పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలి. ప్రజలతో మర్యాద పూర్వకంగా వ్యవహరించాలని ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ అధికారులకు సూచించారు. 

ప్రతి నేరస్థునికి శిక్ష పడేలా కేసులను పక్కా ఆధారాలతో నమోదు చేయాలని సూచించారు. విచారణ వెంటనే పూర్తి చేసి కోర్ట్ లో ఛార్జ్ షీట్ దాఖాలు చేయాలనీ విచారణలో 'పారదర్శకత పాటించాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, మహిళలకు సంబంధించిన కేసులను త్వరితగతికన పరిష్కరించాలి. 

నేరాల నియంత్రణకు విసబుల్ పోలీసింగ్, నిరంతర పెట్రోలింగ్ తో పాటు సాంకేతిక వ్యవస్థ కూడా ఉపయోగించుకోవాలి అన్నారు. 

డ్రంక్ అండ్ డ్రైవ్ తో పాటు డ్రగ్స్ డ్రైవ్స్ కూడా నిర్వహించాలి. పెట్రోలింగ్ వాహనాలతో సిబ్బంది నేరం జరిగిన వెంటనే స్పందించాలని సూచించారు. 

నేర చరిత్ర ఉన్న కేడిలు, డీసీలు, సస్పెక్ట్ షీట్లు ఉన్నవారి ఇళ్లను తనిఖీ చేయాలని, పోలీస్ స్టేషన్ లలో ఫంక్షనల్ వర్టికల్ ప్రక్రియను సక్రమంగా నిర్వహించాలన్నారు. ప్రతి వారం కోర్టు డ్యూటీ అధికారులతో సమావేశం నిర్వహించాలన్నారు. ప్రతి పోలీసు స్టేషన్ పరిధిలో ముఖ్యమైన ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. రోడ్డు ప్రమాదాల ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించి వాటి నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. 

పోలీస్ స్టేషన్ నుండి రోజు ఎన్ని బ్లూ కోల్ట్స్, పెట్రో కార్ప్ విధులు నిర్వహిస్తున్నాయని, పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్కడెక్కడ ఎన్ని బిట్స్ నడుస్తున్నాయని తెలుసుకొని ప్రాపర్ గా పెట్రోలింగ్ నిర్వహిస్తూ దొంగతనాలు జరగకుండా చూసుకోవాలని ఆదేశించారు. డయల్ 100 కాల్ రాగానే వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సమస్య పరిష్కరించాలని, బ్లూకోల్డ్స్, పెట్రోల్ కార్ నిరంతరం 24x7 గస్తీ నిర్వహించాలని సూచించారు. 

ప్రజలకు ఎల్లపుడు అందుబాటులో వుంటూ ప్రజల సమస్యలను తీర్చాలని, ప్రజా ఫిర్యాదులలో ఎటువంటి జాప్యం చేయకుండా తక్షణమే స్పందించాలని సూచించారు. 

సిబ్బంది, అధికారులు అందరూ విధులు సక్రమంగా నిర్వహించడం ద్వారానే శాంతిభద్రతలు అదుపులో ఉంటాయని సూచించారు.

వాహనాలు కండిషన్ లో ఉంచుకోవాలని అన్నారు. వాహనాలు ఇన్స్పెక్షన్ నిర్వహించారు.

భూ, సివిల్ కేసుల్లో ఎస్ఓపి ప్రకారం పాందర్శకంగా విచారణ చేపట్టాలన్నారు. గంజాయి, డ్రగ్స్ నియంత్రణకు పోలీస్, ఇతర శాఖల అధికారుల సమన్వయంతో పనిచేయాలి. పోలీస్ స్టేషన్ల పరిధిలో గంజాయితో పాటు ఇతర మత్తు పదార్థాల విక్రయాలతో పాటు రవాణాకు పాల్పడుతున్న వారిపై నజరు పెట్టాలని, ముఖ్యంగా గంజాయితో పాటు నిషేధిత పొగాకు ఉత్పత్తులను అమ్మకాలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించడంతో పాటు వారిపై పీడీ యాక్ట్ క్రింద నమోదు చేయాలని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ అధికారులకు సూచించారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.