(నమస్తే మానుకోట-మహబూబాబాద్)
ఆసుపత్రులలో నాణ్యత ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాదికారి డాక్టర్.బి.కళావతి భాయి అన్నారు. శుక్రవారం జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి. కళావతి భాయి మహబూబాబాద్ పట్టణంలోని అమ్మ హాస్పిటల్ ను ఆకస్మికంగా తనిఖీ చేయడం చేసి రిజిస్టర్లు, రికార్డులను పరిశీలించారు.ధరల పట్టిక, అర్హత లేని సిబ్బందితో హాస్పిటల్ నడుపుచున్నందుకు, పరిశుభ్రతగా లేకుండా నడుపుతున్నందుకు గాను నోటీసులు ఇవ్వడం జరుగుతుందని, తెలంగాణ రాష్ట్ర క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం ప్రకారం ప్రతి హాస్పిటల్ మేనేజ్మెంట్ వారు కూడా దరల పట్టికను, డాక్టర్ల వివరాలను ప్రదర్శించాలని, ఫైర్ సేఫ్టీ మెజర్స్ కు సంభందించిన పరికరాలను అమర్చుకోవాలని, బయో మెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ప్రమాణాలను పాటించాలని, ప్రతి హాస్పిటల్ కు వాహనాలు నిలుపుట కొరకు పార్కింగ్ స్థలము తప్పకుండా ఉండవలెనని లేనియెడల చట్ట ప్రకారము చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు.ఈ తనిఖీలో హెల్త్ ఎడ్యుకేటర్ మహేందర్ రెడ్డి, మంగమ్మ, ఇంచార్జి డి పి హెచ్ ఎన్ ఒ తదితరులు పాల్గొన్నారు.


