నమస్తే మానుకోట న్యూస్ మరిపెడ
మహబూబాబాద్ జిల్లామరిపెడ మండలం ఎల్లంపేట గ్రామానికి చెందిన ఉర్లగొండ మనోజ్ కాంగ్రెస్ పార్టీ యూత్ మండల అధ్యక్షుడిగా నామినేషన్ వేయడం జరిగింది
ఈ సందర్భంగా మనోజ్ మాట్లాడుతూ ఎన్నో కష్టాలను ఉడుదుడుకులను ఎదుర్కొని గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలను అడ్డుకొని అవమానాలకు భరాయించి సామాన్యుడి పక్షాన నిలబడ్డానని,
ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రనాయక్ వారి అడుగుజాడల్లో వారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్క కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్నానని,
మండలంలో కాంగ్రెస్ పార్టీ ఉనికి కూలిపోతుందంటూ అనేక అవహేళనలు అన్ని ఎదుర్కొన్న నిలదొక్కుకోనిలబడ్డానని,
కష్టపడ్డ వారికి పార్టీలో సరైన స్థానం ఉంటుందని
రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి రామచంద్రనాయక్ వారి అడుగుజాడల్లో అనుసరించి పోరాడతానని,
తప్పకుండా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడిగా పార్టీ అవకాశం ఇచ్చి మరెన్నో సేవలను నా నుండి పార్టీ తీసుకుంటుందని పూర్తి నమ్మకంతో నామినేషన్ వేయడం జరిగిందని మనోజ్ తెలిపారు

