Type Here to Get Search Results !

గ్రామస్థాయిలో విద్య, వైద్యం,వ్యవసాయం, బలోపేతానికి సంబంధిత అధికారులు కృషి చేయాలి-అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టోప్పో.

(నమస్తే మానుకోట-మహబూబాబాద్)

గ్రామస్థాయిలో విద్య, వైద్యం,వ్యవసాయం, బలోపేతానికి సంబంధిత అధికారులు కృషి చేయాలని అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) లెనిన్ వత్సల్ టోప్పో అన్నారు.ఈ సందర్భంగా  గంగారం మండల కేంద్రం రైతు వేదికలో సంపూర్ణత అభియాన్ పథకం(నీతి అయోగ్) ద్వారా నిర్వహించే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థల) లేనిన్ వత్సాల్ టోప్పో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పథకంలో భాగంగా ఎంపికైనందున, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ మూడు నెలల వ్యవధిలో క్షేత్రస్థాయిలో (5) థీమ్స్ హెల్త్ అండ్ న్యూట్రిషన్, విద్య, వ్యవసాయం, అంతర్గత అభివృద్ధి, తదితర అంశాలపై (40) ఇండికేటర్స్ లలో సంబంధిత శాఖలు సమన్వయంతో అన్ని ప్యారామీటర్స్ లలో లక్ష్యాల సాధనకు పనిచేయాలనీ తెలిపారు.కస్తూరిబా , ట్రైబల్ వెల్ఫేర్, హాస్టలను తనిఖీ చేసి పిల్లలతో మాట్లాడారు, త్రాగు నీరు, మరుగు దొడ్లు, కరెంట్, ఎలాంటి ఇబ్బందులూ లేకుండా చూడాలన్నారు.గంగారం రైతు వేదిక ఆవరణంలో వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా మొక్క నాటారు, రైతు వేదిక ఆవరణంలో వైద్య ఆరోగ్య శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ, వ్యవసాయ, ఐకెపి, శాఖ,  తదితర శాఖలు ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి గర్భిణీ స్త్రీలు, పిల్లలు, పోషక ఆహారాలపై వివిధ స్కిట్ రూపకాల ద్వారా ప్రదర్శనలు ఇచ్చారు.విద్య, వైద్యం, అంగన్వాడి,  సేవల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులను, పిల్లలను సన్మానించారు.ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ నర్మదా, వ్యవసాయ శాఖ ఏడి అభిమన్యుడు, హార్టికల్చర్ ఏడి మరియాన్న, డిపిఓ హరిప్రసాద్, ఐసిడిఎస్ పిడి వరలక్ష్మి, ఉపవైద్యాధికారి డాక్టర్ అంబరీష్, ఎంపీడీవో అప్పారావు, ఏబిఎఫ్ శ్రీనాథ్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.




Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.