నమస్తే మానుకోట న్యూస్ మహబూబాబాద్
క్రమశిక్షణ మనిషిని ఉన్నత శిఖరాలకు చేరుస్తుందని మహబూబాబాద్ సబ్ జైలు జైలర్ మల్లెల శ్రీనివాసరావు అన్నారు. జైల్లో విధులు నిర్వహిస్తున్న హెడ్ వార్డర్ మాలోత్ వెంకన్న అసిస్టెంట్ డిప్యూటీ జైలర్ గా పదోన్నతి సాధించి బదిలీపై వెళ్తున్న సందర్బంగా జైలు అధికారులు వీడ్కోలు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈసందర్బంగా మల్లెల శ్రీనివాసరావు మాట్లాడుతూ వృత్తిపట్ల అంకితభావంతో సేవా నిరతి కలిగి పదోన్నతి సాధించడం గొప్ప విషయమన్నారు. తాము విధులు నిర్వహించిన సందర్భంలో ఎన్ని ఆతుపోట్లు ఎదురైనా ఉద్యోగం ధర్మాన్ని తప్పకూడదని అన్నాడు. ఉన్నత విలువలతో కూడిన ఉద్యోగం బాధ్యత ఎప్పుడూ మనిషిని ఉన్నత స్థానంలో కూర్చోపెడుతుందని అన్నారు. సమయపాలన ఉత్తమ ఉద్యోగ భాద్యతకు మొదటి మెట్టు అన్నారు. భాద్యతతో కూడిన మాలోత్ వెంకన్న ఉద్యోగ సేవలు అందరికీ స్ఫూర్తిదాయకం అని అన్నారు.
అనంతరం మాలోత్ వెంకన్నకు జైలు అధికారులు శాలువా, జ్ఞాపికతో ఆత్మీయ సన్మానం నిర్వహించారు.
ఇంకా ఈకార్యక్రమంలో సిటిజన్ ఫోరం సభ్యులు శంతన్ రామరాజు, జైలు ఉన్నతధికారులు
డిప్యూటీ జైలర్ పట్టెం బిక్షపతి, సదా నిరంజన్, హెడ్ వార్డర్ ఇఫ్థికర్ మహ్మద్, జితేంధ్రప్రసాద్, పుప్పాల రాజు, ప్రభాకర్ రెడ్డి, చీర వెంకన్న, మహ్మద్ చాంద్ పాషా, బోడ వెంకన్న, సిరిప్రసాద్,పొనుగోటి విజయ్, కడారి కుమారస్వామి, గుగులోత్ మురళి, ఇస్లావత్ దుధియా, అనిత, లక్ష్మణ్, రాజేంద్ర ప్రసాద్, మేరుగు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

