Type Here to Get Search Results !

వరధరాజుల కుంటకు పోయో దారిని చదును చేసి అక్రమణ... నాయబ్ తహశీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్ కు వినతి పత్రం అందజేసిన గ్రామస్తులు

 నమస్తే మానుకోట న్యూస్ నర్సింహులపేట


వరధరాజుల కుంటకు పోయో దారిని చదును చేసి అక్రమణ 

గ్రామ కుంట, బతుకమ్మ ఘాటు, పంటపొలాలకు వెళ్లే రైతులకు ఇబ్బందులు

 కబ్జా చేసిన కర్ణాకర్ పై చర్యలు తీసుకోవాలి

నాయబ్ తహశీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్ కు వినతి పత్రం అందజేసిన గ్రామస్తులు


గ్రామ కుంట బతుకమ్మ ఘాటు, రైతుల పంటపొలాల రోడ్డును కబ్జా చేసిన ఘటన మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం ముంగిమడుగు రెవెన్యూ పరిధిలోని నర్సింహాపురం (బంజర) లో శనివారం చోటుచేసుకుంది. ఈ మేరకు డిప్యూటీ తాహసిల్దార్ సంజీవ, ఆర్డీఓ, కలెక్టర్ కు గ్రామస్తులు వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. నర్సింహాపురం (బంజర) లో వరదరాజుల కుంటకు మరియు బతుకమ్మ, తీసుకెళ్ళుటకు అలాగే రైతులు పంట పొలాలకు వెళ్ళుటకు పూర్వం నుండి అందరూ కలిసి రోడ్డుకు అవసరమయ్యే భూమి ఇచ్చుటకు ఒప్పుకొని తీర్మాణం వ్రాసుకొని, సంతకాలు చేయగా దానికి రూ.లు తొంబై లక్షలతో రోడ్డు మంజూరైదని తెలిపారు. ఆ రోడ్డుకు గత సంవత్సరం శంకుస్ధాపన చేసినట్లు శిలాఫలకం ఉన్నట్లు తెలిపారు. రోడ్డు జాగను మరియు స్మశానవాటిక స్థలాన్ని కలిపి మొత్తం సుమారు 0. 30 గుంటల భూమిని మా గ్రామ పంచాయతీకి శివారు లాలితండాకు

చెందిన గుగులోతు కాళు తండ్రి రూప్లా జె సి బి సహాయముతో మా గ్రామానికి చెందిన నిమ్మరబోయిన కర్ణాకర్ తండ్రి వెంకన్న అను ఇతను శనివారం ఉదయం చేయించుచున్నాడు. ఇదే విషయాన్ని చూసి గొడవకు దిగి, ఇదే విషయాన్ని స్థానిక తాసిల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తాసిల్దార్ సంజీవ కు వినతిపత్రం అందజేసినట్లు గ్రామస్తులు తెలిపారు. గతములో తీర్మానం చేసుకున్న కాగితంతో పాటు నిమ్మరబోయిన కరుణాకర్ అనే వ్యక్తి కూడా సంతకం పెట్టినట్లు గ్రామస్తులు పేర్కొన్నారు. మహిళలు బతుకమ్మ పండుగకు వెళ్ళు దారి రోడ్డును జెసిబి తో ఆనవాలు లేకుండా చదును చేసిన సదర్ వ్యక్తి కర్ణాకర్ పై చర్యలు తీసుకోవాల్సిందిగా పలువురు గ్రామస్తులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులైన నీలం వెంకన్న,   రావనబోయిన సైదులు, ఆర్ వెంకన్న, శ్రీను, సుధాకర్, జగదీశ్వర్, మరపంగు ఎల్లయ్య, భయ్య సమ్మయ్య, వీరన్న తదితరులు పాల్గొన్నారు 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.