నర్సింహులపేట మండలం జయపురం
గ్రామంలో ప్రతి సంవత్సరం వేసవి వాలీబాల్
శిక్షణ శిబిరం 40 రోజుల పాటు శ్రీరామ్ సిటీ
యూనియన్సైనాన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్
వంగల ప్రవీణ్ కుమార్, గ్రామస్థుల ఆర్థిక
సహకారంతో కీర్తిశేషులువంగాల సుదర్శన్
రెడ్డి, వంగాల రాంచంద్రారెడ్డివారి జ్ఞాపకార్థం
రిటైర్డ్ వ్యాయామ ఉపాధ్యాయుడు కోచ్
నెలకుర్తి వీరారెడ్డి ఆధ్వర్యంలో
వాలీబాల్,టేబుల్ టెన్నిస్ సమ్మర్ క్యాంపును
27-04-2024 నుండి 09-06-2024 వరకు
నిర్వహించాను
ఈ వేసవి
వాలీబాల్ శిక్షణ
శిబిరం ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా
శ్రీ రామ్ ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్
వంగాల ప్రవీణ్ కుమార్ పాల్గొని మాట్లాడుతూ
కనీస బస్సు రవాణా
సౌకర్యం కూడా లేని అతి చిన్న పల్లెటూరులో నిరుపేద విద్యార్థులకు
క్రీడల్లో శిక్షణ ఇచ్చి జాతీయ రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడం
అభినందనీయమని, గ్రామీణ ప్రాంతంలో
ఉన్న విద్యార్థులకు క్రీడల ప్రాధాన్యతను తెలియజేసి వారిని ఒక వేదిక మీదికి తీసుకువచ్చి శిక్షణ ఇవ్వడం వారిని జాతీయ రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనేలా కృషి చేస్తూ భవిష్యత్ తరంలో క్రీడా స్ఫూర్తిని
నింపే విధంగా చేయడం అభినందనీయమని ప్రతి ఏటా ఇలాంటి శిక్షణ శిబిరాలను
ఏర్పాటు చేస్తూ విద్యార్థులను మళ్ళీ మరింత ఉన్నత శిఖరాలకు చేర్చేందుకు కృషి చేయాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా అంతర్జాతీయ వాలీబాల్ క్రీడాకారిణి చందు లావణ్యను శాలువాతో సన్మానించి, గోల్డ్ చైన్ తో పాటు 20 వెయ్యిల రూపాయలు నగదును బహుకరించిన గ్రామ ఉద్యోగులు, రెడ్డి పరపతి సంఘం వారు
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి నెలకుర్తి కృష్ణ రెడ్డి ఉప్పల్ రెడ్డి రఘోత్తం రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, సురేందర్ రెడ్డి,జెన్నపురెడ్డి అశోక్ రెడ్డి, జంపాల అశోక్, AO రవీందర్ రెడ్డి మల్లారెడ్డి, శ్రీరాం చిట్ ఫైనాన్స్ రిజనల్ మేనేజర్ సతీష్, శ్రీనివాస్ రెడ్డి గ్రామ నాయకులు నెలకుర్తి సత్తిరెడ్డి అశోక్ రెడ్డి గ్రామస్థులు
సురేష్ అనిల్ రాచమల్ల విజయ్, క్రీడాభిమానులు, క్రీడాకారులు
తదితరులు పాల్గొన్నారు
2015 సంవత్సరంలో మొదలైన శిక్షణ క్రమేపి
వాలీబాల్ సమ్మర్ కోచింగ్ క్యాంపుగా మారిన కటోర దీక్ష.
నర్సింహులపేట మండలం లోని జయపురం గ్రామంలో 2015 నుండి ప్రతి ఏటా వేసవి వాలీబాల్ శిక్షణ శిబిరం నెలరోజుల పాటు శ్రీరామ్
సిటీ యూనియన్ ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వంగాల ప్రవీణ్
కుమార్,గ్రామస్థుల ఆర్థిక సహకారంతో మారుమూల గ్రామం లోని
విద్యార్థినీలను వాలీబాల్, క్రీడలో జాతీయ స్థాయి క్రీడాకారులు గా
తీర్చిదిద్దుటకు రిటైర్డ్ వ్యాయామ ఉపాధ్యాయుడు కోచ్ నెలకుర్తి వీరారెడ్డి
కృషిచేస్తున్నారు. దీనికి గాను జయపురం గ్రామానికి చెందిన కీర్తిశేషులు
వంగాల సుదర్శన్ రెడ్డి, వంగాల రాంచంద్రారెడ్డి జ్ఞాపకార్థం వారి
కుమారుడు శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్
వంగల ప్రవీణ్ కుమార్ సహకారంతో వాలీబాల్ క్యాంపును నెలరోజుల
పాటు నిర్వహించారు. మొదటగా గ్రామంలోని విద్యార్థులు వేసవిలో
చెడు అలవాట్లవైపు ఆకర్షితులు కాకుండా వారిని ఆరోగ్య వంతంగా
తీర్చిదిద్దడానికి మొదలైన ప్రయాణం ఈ ఎనిమిదేళ్ళలో ఏన్నో, జాతీయ
రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొనెలా చేసింది. నేటికి ఎలాంటి లాభాపేక్ష
లేకుండా ఎంతో శ్రమించి ఇస్తున్న శిక్షణ సమ్మర్ వాలీబాల్ శిక్షణ
శిభిరంగా పరిణవించింది. అతిచిన్న గ్రామమైన జయపురంలో ఎలాంటి
హంగులు ఆర్భాటాలు లేకున్నా ఉన్నతమైన సౌకర్యాలు కల్పించకున్న
గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ఉన్న అతి చిన్న మైదానంలో
విశ్రాంత వ్యాయామ ఉపాధ్యాయుడు నెలకుర్తి వీరారెడ్డి కృషితో
2015 సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం అండర్ 14 విద్యార్థులకు నెల రోజుల పాటు సమ్మర్ వాలీబాల్ కోచింగ్ క్యాంపు నిర్వహిస్తున్నారు. ఈ
శిక్షణ శిబిరం లో సుమారు 50 మంది విద్యార్థులు క్రీడా మెళుకువలు
పొందుతున్నారు. ఈ శిక్షణ 2015 సంవత్సరం గ్రామ స్థాయిలో మొదలు
పెట్టిన క్రీడల్లో ఈ గ్రామ విద్యార్థులు 2023 సంవత్సరంలో జరిగిన సీఎం కప్ రాష్ట్ర
స్థాయిలో ద్వితీయ స్థానం గెలుపొందటంతో పాటు ఇప్పటి వరకు
తెలంగాణ జుట్టు తరుఫున ఎనిమిది సార్లు జాతీయ స్థాయి లో ఆడి
ప్రతిభ కనబరిచారు, చెందు లావణ్య 2018 లో మంచిర్యాల లో
నిర్వహించిన సబ్ జూనియర్ వాలీబాల్ షిప్ లో గోల్డ్ మెడల్ కైవసం
చేసుకుంది. 2019 లో నిజామాబాద్ లో ఎస్ జీ ఎఫ్ చాంపియన్ షిప్ లో
గోల్డ్ మెడల్ ను 2019 లో ఖమ్మం లో జరిగిన రాష్ట్ర స్థాయి క్రీడలో
సిల్వర్ మెడల్ కైవసం చేసుకున్నారు. అండర్ 20 ఏషియన్
చాంపియన్షిప్ కొరకు భువనేశ్వర్ క్యాంపు కు సెలెక్టై శిక్షణ
తీసుకుంటుంది, కజకిస్తాన్ లో జరిగిన ఏషియన్ శాంపియన్ షిప్ లో
కూడా ప్రతిభ కనభరిచింది. నెలకుర్తి కృష్ణారెడ్డి - మాధవిల కూతురు
అర్జున అవార్డు గ్రహిత, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సిక్కిరెడ్డి స్వస్థలం
జయపురం గ్రామమే కావడం విశేషం. నిరుపేద కుటుంబాల పిల్లలకు
క్రమశిక్షణ నేర్పించాలని తలచిన రిటైర్డ్ పిఈటి వీరారెడ్డి. సాధారణంగా
విశ్రాంత ఉద్యోగులు పదవీ విరమణ అనంతరం గత వ్యాపకాలను
వదిలేసి విశ్రాంతి తీసుకుంటారు, లేదా కుటుంబ వ్యవహారాలు
చూసుకోవడంలో నిమగ్నమై ఉంటారు, కానీ జయపురం గ్రామానికి చెందిన విశ్రాంత వ్యాయామ ఉపాధ్యాయుడు గ్రామంలోని నిరుపేదలైన
విద్యార్థులను చేరదీసి వారిలో క్రమశిక్షణ యువతమైన జీవనాన్ని
అలవర్చాలనే సంకల్పంతో క్రీడలను పరిచయం చేస్తూ వస్తున్నారు.
ఎలాంటి లాభాపేక్ష లేకుండా స్వంత పనులను వదిలేసి ప్రతిరోజూ
విద్యార్థులకు వాలీబాల్ టేబుల్ టెన్నిస్ క్రీడలపై శిక్షణ ఇస్తూనే ఉంటారు.
తద్వారా మెరికల్లాంటి విద్యార్థులను తయారుచేస్తున్నారు. విశ్రాంత
ఉపాధ్యాయుని కృషికి తల్లిదండ్రులు, గ్రామస్తులు అభినందిస్తున్నారు.
అదో మారుమూల గ్రామం ఎంతో మంది క్రీడాకారులకు పుట్టిన ఇల్లు. అర్జున అవార్డు పొందిన అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సిక్కిరెడ్డి జన్మించిన గ్రామం..ఈ గ్రామంలో ఉన్న యువత క్రీడలతోనే ఎన్నో ఉద్యోగాలు సాధించారంటే అతియోశక్తి కాదు.గ్రామం నుండి ఫిజికల్ డైరెక్టర్లు,వ్యాయామ ఉపాధ్యాయులు,పోలీసు ఉద్యోగులు ఉన్నారు.అప్పట్లో క్రీడా మైదానాలు లేకున్నా ఆకేరు వాగులోని ఇసుక మేటల్లో కసిగా పరిగెత్తి క్రీడామైదానంలో కఠిన శిక్షణ తీసుకొని ఎందరో ప్రభుత్వ ఉద్యోగం సంపాదించి ఎంతో మంది యువతకు ఆదర్శంగా నిలిచిన గ్రామమే జయపురం. ఈ గ్రామ క్రీడాకారులు టోర్నమెంటులో పాల్గొనాలంటే ఆ గ్రామం విజయకేతనం. అందుకే అందరూ "జయపురం జయకేతనం" అంటారు.
*1974లోనే కాకతీయ క్లబ్ స్థాపన*
జయపురం గ్రామంలో 1974లోనే కాకతీయ యూత్ క్లబ్ ను స్థాపించి ఆ రోజుల్లోనే యువతకు క్లబ్ ద్వారా క్రీడల్లో శిక్షణ ఇచ్చి వారి నైపుణ్యాలను వెలికి తీసి దోహదపడిన వారే ..వంగాల సుదర్శన్ రెడ్డి.క్రీడాకారులకు కావలసిన సామాగ్రిని ఉచితంగా సమకూర్చి పేద క్రీడాకారులను చేరదీసి వారికి క్రీడా శిక్షణలను ఇస్తూ వారిని ప్రోత్సహిస్తు వారి సొంత ఇంటిని యూత్ క్లబ్ గా ఏర్పాటు చేసి ఎందరికో ఆదర్శప్రాయంగా నిలిచారు. వీరు తమ సొంత ఖర్చులతో జయపురం గ్రామంలో వేణుగోపాల స్వామి దేవాలయం పక్కన ఖాళీ స్థలంలో క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేసి క్రీడాకారులకు శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ క్రీడామైదానంలో ఆడిన క్రీడాకారులకు 1984 సంవత్సరంలో ప్రభుత్వ ఉద్యోగాలు పొందడం జరిగింది. ఫిజికల్ డైరెక్టర్ గా వ్యాయామ ఉపాధ్యాయులు గా, పోలీసు ఉద్యోగాలు, టీచర్ గా ఉద్యోగాలు పొందడం జరిగినది. 2015 సంవత్సరంలో నెలకుర్తి వీరారెడ్డి రిటైర్మెంట్ తర్వాత జయపురం ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులకు వాలీబాల్ ఆట పై శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు. వంగాల ప్రవీణ్ కుమార్ (శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్) ఆర్థిక సహకారంతో 2016 సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం అండర్ 14 విద్యార్థులకు జయపురం పాఠశాల క్రీడామైదానంలో కీర్తిశేషులు వంగాల సుదర్శన్ రెడ్డి, రామచంద్రారెడ్డి వారి జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం 50 మంది క్రీడాకారులకు వాలీబాల్ సమ్మర్ క్యాంపు నెల రోజుల పాటు క్రీడాకారులకు శిక్షణ ఇవ్వడం జరిగింది. ఇద్దరి సహాయ సహకారాలతో చందు లావణ్య, మరో కొంతమంది విద్యార్థులు తెలంగాణ జట్టు తరఫున ఎనిమిది సార్లు జాతీయ స్థాయిలో ఆడి ప్రతిభను కనబర్చారు. చందు లావణ్య 2018 లో మంచిర్యాల నిర్వహించిన సబ్ జూనియర్ వాలీ బాల్ షిప్ లో గోల్డ్ మెడల్ కైవసం చేసుకుందని,2019 లో నిజామాబాద్ ఎస్ జీ ఎఫ్ చాంపియన్ షిప్ లో గోల్డ్ మెడల్ ను, 2019 లో ఖమ్మం లో జరిగిన రాష్ట్ర స్థాయి క్రీడలో సిల్వర్ మెడల్ కైవసం చేసుకున్నారని, అండర్ 20 ఏషియన్ శాంపియన్ షిప్ కొరకు భువనేశ్వర్ క్యాంపు కు సెలెక్టై శిక్షణ తిసుకుంటుందని, వచ్చె నెలలో 4 నుంచి 11 వరకు కజకిస్తాన్ లో జరిగే ఏషియన్ శాంపియన్ షిప్ లో కూడా ప్రతిభా కనపరుస్తుందని కోచ్ వీరారెడ్డి, ప్రవీణ్ కుమార్ రెడ్డి, గ్రామస్తులు క్రీడాకారులు ప్రజాప్రతినిధులు జాతీయస్థాయిలో మరోసారి గుర్తింపును సాధించి జయపురం గ్రామానికి కీర్తి గడించి పెట్టాలన్నారు.
క్రీడాకారులను అంతర్జాతీయ స్థాయికి తీసుకురావడమే లక్ష్యం
విశ్రాంత వ్యాయామ ఉపాధ్యాయుడు వీరారెడ్డి
భారత దేశానికి పేరు ప్రఖ్యాతలు తీసుకువస్తున్న అర్జున అవార్డు గ్రహీత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గ్రామానికి చెందిన నెలకుర్తి సిక్కిరెడ్డిని,తన శిక్షణతో ఎదిగిన రాష్ట్ర వాలీబాల్ క్రీడాకారిణి చెందు లావణ్యను ఆదర్శంగా తీసుకోవాలి. నా సర్వీస్ లో ఉన్నప్పుడు ఒక విద్యార్థినైనా నేషనల్ స్థాయిలో తీసుకుపోవాలని అనుకున్నాను గాని కుదరలేదు. నేను రిటైర్డ్ అయిన తర్వాత నా సొంత గ్రామం నుండి విద్యార్థిని నేషనల్ స్థాయిలో ఎనిమిది సార్లు ఆడి ఏషియన్ ఛాంపియన్ షిప్కు పోవడం నాకు ఎంతో గర్వంగా ఉందని తెలిపారు.
*క్రీడల అభివృద్ధికి సంపూర్ణ తోడ్పాటు*
వంగాల ప్రవీణ్ కుమార్ (శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్)
జయపురం పాఠశాలలో ప్రతి సంవత్సరం వంగాల సుదర్శన్ రెడ్డి, రామచంద్రారెడ్డి, జ్ఞాపకార్థం వేసవి శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నాం.దీంట్లో పాల్గొనే క్రీడాకారులకు కావాల్సిన క్రీడా సామాగ్రిని, దుస్తులను ఉచితంగా అందిస్తూ క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నాం.గ్రామంలో ఎంతో మంది క్రీడాకారులు జాతీయ స్థాయి పోటీలలోనూ రాణించి మంచి గుర్తింపు తెచ్చుకోవాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు. అదేవిధంగా క్రీడలతో స్నేహా సంబంధాలు మెరుగు పడుతాయన్నారు. క్రీడల కోసం తనవంతుగా సహాయ సహకారాలు అందిస్తానన్నారు. పేద క్రీడాకారుల కోసం ఇండోర్ స్టేడియం ని నా సొంత ఖర్చులతో నిర్మిస్తాను. పేద విద్యార్థుల కోసం లైబ్రరీ ఏర్పాటు చేస్తాను అన్నారు .


.jpg)
.jpg)
.jpg)
.jpg)