Type Here to Get Search Results !

గుడుంబా స్టావారాలపై పోలీసులు దాడులు

 నమస్తే మానుకోట న్యూస్ మహబూబాబాద్




1,60,800 /- విలువ గల 402 లీటర్ల నాటు సారా స్వాధీనం

 11,10,000/- విలువ గల పానకం ద్వంసం

42 కేసులు నమోదు

వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ సుదీర్ రాంనాధ్ కేకన్



మహబూబాబాద్ జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా గుడుంబా సావరాలపై దాడులు నిర్వహించారు.మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ ఆదేశాల మేరకు మహబూబాబాద్ జిల్లా పరిధిలోని అన్ని పోలీసు స్టేషన్ నుండి అధికారులు సిబ్బంది కలసి గుడుంబా స్టావారాలపై దాడులు నిర్వహించారు.

ఈ దాడులలో 42 కేసులు నమోదు చేయడం జరిగింది.అలాగే 1,60,800 రూపాయల విలువ చేసే 402 లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకొని, 11,10,000 రూపాయల విలువ చేసే 11100 లీటర్ల చెక్కెర పానకాన్ని ధ్వంసం చేసినట్లు మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ తెలిపారు.జిల్లా వ్యాప్తంగా జరిపిన ఈ దాడులలో అధికారులు మరియు సిబ్బంది కలిపి 142 మంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ I మాట్లాడుతూ..... మహబూబాబాద్ జిల్లా పరిధిలో నాటు సారా స్థావరాలపై విస్తృత దాడులు నిర్వహించి 42 కేసులు నమోదు చేసి, 402 లీటర్ల నాటు సారా, 11100 లీటర్ల బెల్లం/ చెక్కెర పానకాన్ని ధ్వంసం చేయడం జరిగిందని తెలిపారు. గుడుంబా స్థావరాలకు చోటు లేదని ఎవరైనా ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే వారిపై చట్టపరమైన కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. పటిక బెల్లం అక్రమ రవాణా పైన ద్రుష్టి పెట్టాలని అన్నారు.

గుడుంబా వాళ్ళ జరిగే నష్టాలని అన్ని గ్రామంలో ప్రజలకు తయారీదారులకు అవగాహనా కల్పించాలని అధికారులకు సూచించారు.

ఈ రైడ్స్ లో పాల్గొన్న అధికారులకు సిబ్బందికి ఎస్పీ అభినందనలు తెలిపారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.