Type Here to Get Search Results !

కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్

 నమస్తే మానుకోట న్యూస్ మహబూబాబాద్


మహబూబాబాద్ సోషల్ వెల్ఫేర్ హైస్కూల్ లో ఓట్ల లెక్కింపు ఏర్పాట్లు


ఉదయం 8 గంటల నుంచే ఓట్ల లెక్కింపు ప్రారంభం


నియోజకవర్గాల వారీగా ఓట్ల లెక్కింపు కి 14 టేబుల్స్ 


 జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్


మే 13న జరిగిన పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ఓట్ల లెక్కింపుకు సర్వం సిద్దం చేశామని ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ పేర్కొన్నారు 


రేపు 4న జరగనున్న కౌంటింగ్ ఏర్పాట్లలో బాగంగా సోషల్ వెల్ఫేర్ హైస్కూల్ ను సందర్శించి ఏడు నియోజక వర్గాల కౌంటింగ్ ఏర్పాట్లను పరిశీలించారు.


మీడియా సెంటర్ ఏర్పాట్లు,

వాహనాల పార్కింగ్,శానిటేషన్, త్రాగు నీటి సౌకర్యాలు తదితర ఏర్పాట్లను పరిశీలించారు.

నాలుగు జిల్లాల పరిధిలో ఉన్న ఏడు నియోజకవర్గాల ఓట్ల ఫలితాలు ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఆన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందన్నారు

ఈ కౌంటింగ్ ఏర్పాట్లలో 14 టేబుల్స్,130 రౌండ్ల వారీగా ఈవీఎంల ద్వారా ఓట్ల 

లెక్కింపు జరుగుతుందని,

ఈ కౌంటింగ్ ప్రక్రియలో 440 మంది ఉన్నారు అందులో సూపర్వైజర్స్, అసిస్టెంట్లు, మైక్రో అబ్జర్వర్లు,సపోర్టింగ్ సిబ్బంది కౌంటింగ్ ప్రక్రియ లో పాల్గొన నున్నారని అన్నారు.  


ఎన్నికల కోడ్ ననుసరించి 

144 సెక్షము అమలు లోఉంటుందని,మూడు అంచెల భద్రత వ్యవస్థ నడుమ  

భారీ బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగిందని అన్నారు. 


కౌంటింగ్ ఏర్పాట్లను పకడ్బందీ గా నిర్వహించుటకు ఎన్నికల యంత్రాంగం సర్వం సిద్దం చేసిందని వారు అన్నారు.

ఏజెంట్లు వారికి జారీ చేసిన పాసులు వెంట తీసుకొని రావాలి..ఫోన్లు డిపాజిట్ కేంద్రాల్లో అప్పగించాలి.. అన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.