మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలోని పడమటి గూడెం గ్రామంలో బాలవికాస సంస్థ ఆధ్వర్యంలో గ్రామస్తులు,మహిళలతో అంతర్జాతీయ వితంతువుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు
.ఈ సందర్భముగా అవగాహణ మీటింగు,ర్యాలీ నిర్వహించరు
ఈ సందర్భంగా బాలవికాస మండల కోఆర్డినేటర్ కందుకూరి సుకన్య మాట్లాడుతూ జూన్ 23 వ తేదీని ఐక్య రాజ్య సమితి జనరల్ అసెంబ్లీ అధికారిక అంతర్జాతీయ వితంతువుల దినోత్సవంగా 2010,డిసెంబర్ లో ప్రకటించి,లక్షలాది మంది వితంతువులు ఎదుర్కొంటున్న పేదరికం,అన్యాయాన్ని పరిష్కరించడానికి కేటాయించిన ప్రత్యేకమైన రోజు ఇది….ప్రపంచంలో 258 మిలియన్లు వితంతువులు ఉంటే కేవలం భారత దేశంలోనే 40మిలియన్లకు పైగా ఉన్నారని గ్లోబల్ విడోస్ రిపోర్ట్ 2015 ద్వారా తెలపడం జరిగిందని, కోవిడ్ 19 మహమ్మారి కారణంగా వితంతుల సంఖ్య బాగా పెరిగిందని, ప్రపంచం మొత్తంలో భారతదేశంలోనే అత్యధిక సంఖ్యలో వితంతువులున్నారని.దాని తర్వాత చైనా రెండవ స్థానంలో ఉంది.ఇంత పెద్ద సంఖ్యలో వితంతువులు నివసిస్తున్న మన దేశంలో సమాజం వారి పట్ల ఎలా వ్యవహరిస్తుందనేది చాలా ముఖ్యం…ఆలోచించాల్సిన విషయం అని, ఐక్యరాజ్య సమితి నిర్ణయించిన విధముగా “నూతన ఆవిష్కరణలు సాంకేతికతతో లింగ సమానత్వం “అను అంశం ఆధారంగా ఈ మీటింగు కొనసాగింది
బాల వికాస వివిధ అభివృద్ధి పధకాలు నిర్వహిస్తున్న తెలంగాణ,ఆంధ్రప్రదేశ్,కర్ణాటక,మహారాష్ట్,ఒరిస్సా రాష్ట్రాలలోని 31 జిల్లాలలోని సుమారు 50 గ్రామాలలో పలురకాల అభివృద్ధి కమిటీల ఆధ్వర్యంలో అంతర్జాతీయ వితంతువుల దినోత్సవం సందర్భముగా వితంతువుల కు జరుగుతున్న వివక్షతను రూపుమాపుటకై అవగాహన మీటింగులు ఏర్పాటు చేసి,ర్యాలీలు నిర్వహించడం జరుగుతుందని, వితంతులపై వివక్షత నిర్మూలపై ప్రతి ఒక్కరు పాటుపడాలని వారిచేత ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు
ఈ సమావేశంలో మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు చిర్ర సతీష్, సోమిరెడ్డి, శ్రీశైలం, బాలవికాస ప్రతినిధులు స్వర్ణలత, స్వరూప రాణి,యాకలక్ష్మి, చాంద్ కి, నాగలక్ష్మి, సంధ్యారాణి, శోభారాణి, మంజుల, భాగ్యలక్ష్మి, జ్యొతి కళావతి, రోజా రాణి, జానకి తదితరులు పాల్గొన్నారు


