నమస్తే మానుకోట న్యూస్ మరిపెడ
అక్రమ దందాలకు అడ్డాగా మరిపెడ.. మండలం
విచ్చల విడిగా రేషన్ బియ్యం,నల్ల బెల్లం దందా..
చిత్తూరు టూ మరిపెడ నల్ల బెల్లం..మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం అక్రమ వ్యాపారాలకు అడ్డాగా మారింది..
పేద ప్రజలకు అందిస్తున్న రేషన్ బియ్యం దందా దారులకు వరంగా మారుతోంది..
రేషన్ డీలర్ల తో కుమ్మక్కు అవ్వడం తో పాటు ప్రజల నుంచి 5 రూపాయలకు కొనుగోలు చేసి 25 రూపాయలకు ఆంధ్ర ప్రాంతానికి తరలిస్తూ దందా ను కొనసాగిస్తున్నారు..
మరిపెడ టూ వయా కురవి నుంచి ఖమ్మం మీదుగా ఆంధ్రా ప్రాంతానికి పెద్ద ఎత్తున లారీల్లో రేషన్ బియ్యాన్ని తరలిస్తూ దందా కొనసాగుతుంది
గుడుంబా ను నిర్మూలిస్తునామని ప్రభుత్వం చెప్తున్నప్పటికి చిత్తూరు నుంచి టన్నుల కొద్ది నల్ల బెల్లం తండాలకు ,పల్లెలకు రాత్రి వేళల్లో రావణా జరుగుతుంది..
సంబంధిత అధికారులు మాత్రం అమాయక గిరిజన ప్రజలపై కేసులు పెడుతూ.. టన్నుల కొద్దీ నల్ల బెల్లాన్ని ఈ ప్రాంతానికి తీసుకొస్తున్న అసలు దొంగలను కాపాడుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు..
జిల్లా అధికారులు సంబంధిత విషయం పై ద్రుష్టి సారించి అక్రమ వ్యాపారాలకు అడ్డు కట్ట వేసేలా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు..



