నమస్తే మానుకోట న్యూస్ కురవి
కురవి మండలం, కందికొండ గ్రామ పరిధిలో గల కిసాన్ పరివార్ వ్యవసాయ
క్షేత్రంన్నీ సనాతన్ ధర్మ ఫౌండేషన్ వ్యవస్థాపకులు & చైర్మన్ శ్రీ శ్రీ శ్రీ నారాయణానంద్ గిరి మహారాజ్ స్వామీజీ తో కలిసి కిసాన్ పరివార్ వ్యవసాయ
క్షేత్ర సంస్థ వ్యవస్థాపకులు యువ దళపతి నానవత్ భూపాల్ నాయక్ వీక్షించారు
ఈ సందర్బంగా విలేకరులతో ఆయన మాట్లాడుతూ నేను రాజకీయ లాభాలా కోసం ఇక్కడికి రాలేదు, మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో గల యువత & రైతుల సమస్యల సాధనలో ఒక ఆయుధం అవ్వటానికే ఉన్నాను. ఇక్కడ రైతులకు పండించే పంటకు సరైన గిట్టుబాటు ధర లేక, అన్నంపెట్టే పనిని వదిలేసి పట్టణాలకు వలస బాట పడుతున్నారు, అలాంటి రైతు అన్నలకు తమ్ముళ్లకు ఇంకెప్పుడు అలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే ప్రతి పంటకు గిట్టుబాటు ధర అత్యధికంగా ఉండాలి. అందుకే ఇక్కడ దళారీ వ్యవస్థ కాకండా స్వయంగా రైతులకు లాభం చేకూరి ఎకరానికి రెండు లక్షల రూపాయల లాభసాటి వ్యవసాయం పద్ధతులను వివరించే విధంగా కందికొండ వ్యవసాయ క్షేత్రం ను ఒక ఆదర్శ వ్యవసాయ క్షేత్రం గా తీర్చి దిద్ది, మండలాల వారీగా కొనుగోలు కేంద్రాలను నిర్మించి, గత ఎన్నికల్లో ప్రకటించిన హామీ పత్రం లో పేర్కొన్న విధంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ని నిర్మించి రైతులకు ఉపయోగం తో పాటు యువతకు ఉపాధి అందించే పనిలో సర్వత్రా నిమగ్నమై ఉంటానని అందరికి మనవి చేస్తున్నాను. ఈ సందర్బంగా స్వామీజీ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో తనకు ఉన్న అనుభవన్నీ వివరించారు, ఈ ప్రాంతానికి ఇంత గొప్ప మనసున్న భూపాల్ నాయక్ వంటి మంచి సేవకుడు దొరకడం ఇక్కడి ప్రజల పూర్వ జన్మ సుకృతం అని తెలిపారు.


