నమస్తే మానుకోట న్యూస్ మహబూబాబాద్
రెవెన్యూ శాఖ సీసీఎల్ఏ ఇంచార్జ్ ప్రిన్సిపల్ సెక్రెటరీ, నవీన్ మిట్టల్ జిల్లా కలెక్టర్లతో శనివారం రోజున నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ధరణి పెండింగ్ దరఖాస్తుల పైన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పెండింగ్ లో ఉన్న ధరణి అప్లికేషన్లను త్వరితగతిన పరిష్కరించాలని, జిల్లాలో మండలాల వారీగా గ్రామాల వారీగా ధరణి సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టి జిల్లాలో పెండింగ్ లో ఉన్న ధరణి సమస్యలను పరిష్కరించాలని ఇంచార్జీ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ జిల్లా కలెక్టర్లకు సూచించారు.
వీడియో కాన్ఫరెన్స్ అనంతరం ఇంచార్జీ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ ఆదేశాల ననుసరించి జిల్లాలో పెండింగ్ లో ఉన్న ధరణి సమస్యల పై వచ్చిన దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సంబంధిత మండలాల తహసిల్దార్లను ఆదేశించారు.
ఈ వీడియో కన్పరెన్స్ లో రెవిన్యూ అదనపు కలెక్టర్ డేవిడ్, ఆర్డీవో మహబూబాబాద్ అలివేణి, తొర్రూరు ఆర్డీవో నర్సింహ రావు,
వివిధ మండలాల తహసీల్దార్లు, కలెక్టరేట్లోని రెవెన్యూ విభాగానికి చెందిన వివిధ శాఖల సూపరిండెంట్లు పాల్గొన్నారు.

