నమస్తే మానుకోట న్యూస్ మహబూబాబాద్
నూతన చట్టాలపై జిల్లా పోలీస్ అధికారులకు మరియు సిబ్బందికి దశల వారీగా ముగిసిన శిక్షణా తరగతులు
ప్రతి ఒక్క పోలీసు అధికారి కొత్త చట్టాల గురించి పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉండాలి
మహబూబాబాద్ జిల్లా పోలీసులకు నిర్వహించిన శిక్షణా తరగతుల ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్
మహబూబాబాడ్ జిల్లా కేంద్రం టౌన్ పోలీస్ స్టేషన్ కాన్ఫరన్స్ హాల్ నందు నూతన చట్టాల గురించి ఏర్పాటు చేసిన శిక్షణా తరగతుల ముగింపు కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ ఈ రోజు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జులై ఒకటో తేదీ నుండి అమలులోకి రానున్న నూతన చట్టాల పట్ల ప్రతి ఒక్క పోలీసు అధికారి మరియు సిబ్బంది అవగాహన కలిగి ఉండాలని ఉద్దేశంతో ప్రతి సబ్ డివిజన్లోని అధికారులు మరియు సిబ్బందికి
ఈ శిక్షణ తరగతులను ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు.
జులై 1వ తేది నుండి దేశవ్యాప్తంగా కొత్త చట్టాలను అమలు చేస్తూ భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని,అందుకు అనుగుణంగా కొత్త చట్టాలను అనుసరిస్తూ ముందుకు సాగాల్సి ఉంటుందన్నారు.కొత్త చట్టాలైన భారతీయ న్యాయ సంహిత(BNS),భారతీయ నాగరిక్ సురక్ష సంహిత(BNSS),భారతీయ సాక్ష్యా అధినియం-2023 పూర్తి అవగాహన కలిగి ఉన్నపుడే సమర్ధవంతంగా విధులు నిర్వహించగలమని,
కొత్త చట్టాలపై పూర్తి స్థాయిలో అవగాహన రావాలంటే ప్రతి ఒక్కరిలో నేర్చుకోవాలనే తపన ఉన్నప్పుడే సాద్యం అవుతుందన్నారు.
కొత్త చట్టాల అమలు జరిగిన వెంటనే ఎటువంటి సమస్యలు తలెత్తకుండా అన్ని సెక్షన్లపై పూర్తి అవగాహన అవసరమన్నారు.
అప్పుడే బాధితుల నుంచి వచ్చే ఫిర్యాదులను స్వీకరించి ఆయా సెక్షన్ల కింద కేసులు నమోదు చేయవచ్చాన్నారు.అరెస్ట్,వాంగ్మూలం నమోదు నందు పాటించవలసిన జాగ్రత్తలు పాటిస్తూ నిందితులకు శిక్షలు ఖరారు చేయడంలో దర్యాప్తు అధికారులు వ్యవహరించవలసిన తీరు,తదితర అంశాలపై కొత్త చట్టాలలో మార్పుల గురించి వివరించారు.
భారతన్యాయ వ్యవస్థ ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నదనీ,అవసరాన్ని బట్టి ప్రజా భద్రత కోసం ఎన్నో చట్టాలను రూపకల్పన చేయడం జరుగుతుందన్నారు.నూతన చట్టాల ద్వారా కేసుల దర్యాప్తు,విధి విధానాలు,విచారణ పద్ధతుల్లో మార్పు వస్తుందని,ప్రజలకు మరింత సమర్థవంతంగా సేవలందించేందుకు వీలుగా ఉంటుందన్నారు.అధికారులు,సిబ్బంది ప్రతి ఒక్కరూ కొత్త చట్టాలను నేర్చుకోవాలని సూచించారు.జిల్లా వ్యాప్తంగా ఈ నూతన చట్టాలపై పోలీసు అధికారులకు మరియు సిబ్బందికి శిక్షణ తరగతులను ఏర్పాటు చేయడంలో సమన్వయాధికారిగా వ్యవహరించిన డీసీఆర్బీ డిఎస్పీ గండ్రతి మోహన్ మరియు అడిషనల్ ఎస్పీ జోగుల చెన్నయ్య, సబ్ డివిజన్లోని పోలీసు అధికారులు తిరుపతి రావు మరియు సీఐ డోర్నకల్ ఉపేందర్, ఎస్. ఐ రమాదేవి, ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది.


