నమస్తే మానుకోట న్యూస్ చిన్న గూడూరు
మహబూబాబాద్ జిల్లా చిన్న గూడూరు మండలం ఆకేరు వాగు నుంచి జోరుగా అక్రమంగా ఇసుక రవాణా జరుగుతుంది..
రాత్రి పగలు తేడా లేకుండా అనుమతుల పేరిట వందలాది ట్రిప్పుల ఇసుక ను రావణ చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు..
ఆకేరు వాగు పరిసరాల్లో వందలాదిగా ఇసుక డాంపులు ఉన్నప్పటికీ సంబంధిత అధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు..
జిల్లా అధికారులు చొరవ తీసుకొని అక్రమ ఇసుక రవాణా ను అరికట్టాలని ఆకెరు పరిసర ప్రాంత ప్రజలు డిమాండ్ చేస్తున్నారు


