నమస్తే మానుకోట న్యూస్ మహబూబాబాద్
SAY YES TO LIFE.....
SAY NO TO DRUGS.....
గంజాయి మత్తులో పడి యువత భవిష్యత్తు కోల్పోకండి.
గంజాయి లాంటి మత్తుపదర్ధాలకు దూరంగా ఉండండి.
అంతర్జాతీయ మాదకద్రవ్యల వ్యతిరేక దినం సందర్బంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రం లో బైక్ ర్యాలీ, మరియు మానవహారం లో పాల్గొన్న మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్
ఈ సందర్బంగా ఎస్పీ గారు మాట్లాడుతూ....
ప్రజల ఆరోగ్యం, ముఖ్యంగా యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మత్తుపదార్థాల నియంత్రణే లక్ష్యంగా మహబూబాబాద్ జిల్లా పోలీసులు ముందుకు సాగుతున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మత్తు దందాపై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు.
.డ్రగ్స్, గంజాయి విక్రేతలు, సరఫరాదారుల సమాచారం సేకరించి వారిపై నిఘా పెట్టాం అన్నారు..
మాదకద్రవ్యాల వాడకంపై మహబూబాబాద్ జిల్లా పోలీసు యంత్రాంగం ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అని అన్నారు.డ్రగ్స్, గంజాయి కొనుగోలు చేస్తూ పట్టుబటిన వారిని అదుపులోకి తీసుకుని తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చి వారిలో మార్పు కోసం రిహాబిటేషన్ సెంటర్స్ కు పంపి వారికి కొత్త జీవితం పరిచయం చెసే ప్రయత్నంలో పోలీస్ ముందడుగు వేస్తుందాన్నారు.యువత మత్తు ఉచ్చులో చిక్కుకుని భవిష్యత్ నాశనం చేసుకోవద్దని సూచిస్తున్నారు. తల్లిదండ్రులు సైతం ఇంట్లో పిల్లలపై చెడుదారుల్లో వెళ్లకుండా పర్యవేక్షించాలని అన్నారు.. డ్రగ్స్, గంజాయి, గుట్కాలాంటి మత్తుపదార్థాలపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పిస్తున్న పోలీసులు మాదకద్రవ్యాల రహిత రాష్ట్ర నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని సూచించారు.. మత్తు విక్రయాల గురించి సమాచారం తెలిస్తే వెంటనే డయిల్ 100 లేదా మీ దగ్గరిలో ఉన్న పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వాలని జిల్లా ఎస్పీ కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో లో అదనపు ఎస్పీ జోగుల చెన్నయ్య, మహబూబాబాద్ డిఎస్పీ తిరుపతి రావు, DCRB వర్టికల్స్ డిఎస్పీ మోహన్, ఏ.ఆర్ డిఎస్పీ శ్రీనివాస్, విజయ ప్రతాప్ గార్లు, సీఐలు, ఎస్.ఐలు పోలీస్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు
.



