Type Here to Get Search Results !

పడమటి గూడెం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం*

 నమస్తే మానుకోట న్యూస్ నర్సింహులపేట


శుక్రవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో రైతులకు ఒకేసారి రెండు లక్షల రూపాయల రుణమాఫీ అమలుపై నిర్ణయం తీసుకోవడం హర్షించదగ్గ విషయమని, రైతుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాటుపడుతున్నాడని పడమటి గూడెం గ్రామ పార్టీ అధ్యక్షులు జక్కుల ఉప్పలయ్య అన్నారు.

ఆదివారం డోర్నకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి చిత్ర పటనికి గ్రామములో రైతులతో కలిసి పాలబిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 

మాట ఇస్తే నిలబెట్టుకునే పార్టీ కాంగ్రెస్ అని చెప్పారు. తెలంగాణ ఇస్తానన్న హామీని ఏఐసీసీ అగ్రనేత సోనియాగాంధీ నిలబెట్టుకున్నారని గుర్తు చేశారు. 2022 మే 6న వరంగల్ రైతు డిక్లరేషన్లో.. రూ.2 లక్షల రైతు రుణమాఫీ చేస్తామని రాహుల్ హామీ ఇచ్చారు. వారి మాట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ కి ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని తెలిపారు. రైతు రుణమాఫీ కోసం రూ.31 వేల కోట్లు అవసరమని అయినప్పటికీ ప్రత్యేకంగా సబ్ కమిటీ ఏర్పాటు చేసి ఆగస్టు 15 నుంచి పూర్తిస్థాయిలో రెండు లక్షల రుణమాఫీ చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. 2006లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో 13వేల కోట్లతో రైతులకు రుణమాఫీ చేసిన ఘనతను గుర్తు చేశారు.పదేళ్లలో కేసీఆర్ చేసిన రుణమాఫీ కేవలం రూ.28 వేల కోట్లు అని తెలిపారు. అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోనే తాము రుణమాఫీ చేశామన్నారు. పారదర్శకంగా రైతుబంధు పథకాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చారు. రైతు భరోసా కోసం మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించినట్లు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రైతు భరోసా ఇస్తామన్నారు. ప్రధానంగా నల్లమల్ల అటవీ ప్రాంతంలో పోడు భూములను సాగు చేసుకుంటున్నా రైతులందరికీ త్వరలోనే పట్టా పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కనకచరి నాగరాజు మైపాల్ సోమీ రెడ్డి వెంకన్న ప్రతాప్ యకాన్నా ఉపేందర్ నాగన్న మైపాష అనిల్ సతీష్ విజాయిపల్ ఆవుల మధు మంచాల కొమురయ్య రామన్న ప్రభాకర్ సైదుల్ నవీన్ అశోక్ సందీప్ మధు యకన్న సురేందర్ మురళి సింహాద్రి శ్రీనివాస్ రెడ్డి అశోక్ వెంకన్న కృష్ణయ్య జక్కుల ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad