Type Here to Get Search Results !

వారాంతపు సంత - వసతుల్లేక సమస్యల చింత ఎండకు ఎండుతు వానకు తడుస్తూ రొడ్డుపైనే విక్రయాలు

 నమస్తే మానుకోట న్యూస్ నర్సింహులపేట



నర్సింహులపేట మండల కేంద్రంలోని ప్రతి శనివారం జరిగే వారాంతపు సంతలో తాజా కూరగాయలు, ఆకు కూరలు, పప్పుదినుసులు లభిస్తుండటంతో స్థానికులే కాకుండా మండలంలోని చుట్టూ ప్రక్కల గ్రామాల ప్రజలు సంతకు చేరుకుని కొనుగోలు చేస్తుంటారు ఈ సంతలో కనీస వసతులు కరువవ్వడంతో చిరు వ్యాపారులు, విక్రయ దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు 

చిన్న చిరుజల్లు వర్షం కురిసిందంటే చాలు ఆ దారి అంత వర్షపు నీటితో నిండిపోయి జలమయమై రోడ్డు పైనే నీరు నిలుస్తుంది కూరగాయలు నీళ్ళలో నే పెట్టి అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉంటుంది

వర్షం వస్తే కొనుగోలు దారులు, వ్యాపారులు అవస్థలు పడుతున్నారు 

రోడ్డుకు ఇరువైపులా కూరగాయలు, పండ్ల, చిరు వ్యాపారులు దుకాణాలను ఏర్పాటు చేసుకుని క్రయ విక్రయాలు కొనసాగిస్తున్నారు 

సంత జరిగే శనివారం రోజంతా రద్దీగా ఉండటంతో పాటు ఆటోలు, బైక్ లు రోడ్డు పక్కనే నిలపడం వలనా వాహన దారులు, పాదా చారులు, బడి పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు

సంత ఆదాయం ప్రతి ఏటా పెరుగుతున్న సమస్యలు మాత్రం తీరడం లేదు 

అంగడి తైబజార్ వేలం ద్వారా గ్రామ పంచాయితీకి రూ లక్షల్లో ఆదాయం చేకూరుతున్నా సౌకర్యాల కల్పనలో నిర్లక్ష్యం వహిస్తుంది కనీసం షెడ్లయినా నిర్మించలేని పరిస్థితి ఫలితంగా ఎండలో, వానలో రొడ్డుపైన కూరగాయల క్రయ విక్రయాలు జరుగుతున్నాయి

సంత వలన ప్రయోజనాలు ఎన్నో..గ్రామీణులకు పట్టణాలకు పోయే కష్టాలు తీర్చడంతోపాటు ఉన్న ఊరిలోనే సరుకులు లభించడానికి సంతలు ఎంతో ఉప యోగపడతాయి. అనేక దశాబ్దాలుగా వారాంతపు సంతలు గ్రామీణ అవసరాలను తీరుస్తున్నాయి. స్థానికంగా రైతులు పండించిన కూరగాయలు, ఆహార ఉత్పత్తులు, పప్పు దిను సులతో పాటు కుటుంబ అవసరాలకు ఉపయోగించే దాదాపు అన్ని రకాల వస్తువుల విక్రయాలు ఇక్కడ జరు గుతుంటాయి. వారాంతపు సంతలు పేదలకు సూపర్‌ బజార్ల లాంటివి. గ్రామాల్లో నేటికీ వాటికి ఆదరణ తగ్గలే దంటే అవి ఎంత కీలకభూమిక పోషిస్తున్నాయో గమనించవచ్చు. ప్రస్తుతం ఉన్న సంతల్లో ఎలాంటి ప్రాథమిక సదుపాయాలు లేవు. దీనితో అటు రైతులు, ఇటు కొను గోలుదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఒకే చోట దుకాణాల సముదాయాలను నిర్మిస్తే వసతులు మెరు గుపడి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది.

వర్షాకాలం వస్తే కొనుగోలు దారులు, వ్యాపారులు అవస్థలు పడుతున్నారు ప్రజల ఇబ్బందులు దృష్టి లో ఉంచుకొని మార్కెట్ షెడ్లు నిర్మాణానికి నిధులు మంజూరు కోసం ప్రజా ప్రతినిధులు, అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని మండల ప్రజలు, చిరు వ్యాపారులు కోరుతున్నారు

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.