నమస్తే మానుకోట న్యూస్ మహబూబాబాద్
తెలంగాణ రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ ఆదేశాల మేరకు మహబూబాబాద్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ గవర్నింగ్ బాడీ సమావేశం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో రెడ్డి బజారులోని పేరాల కట్టయ్య ఫంక్షన్ హాల్ లో జరిగింది.
ప్రస్తుత క్రీడాకారులు, మాజీ క్రీడాకారులు, కబడ్డీ క్రీడ ప్రోత్సాహకులు, తెలంగాణ రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కే. జగదీశ్వర్ యాదవ్ ఆధ్వర్యంలో, గవర్నమెంట్ జంగం సిద్దార్థ ఎన్నికల రిటర్నింగ్ అధికారి సమక్షంలో నూతన జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
మహబూబాబాద్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులుగా మూడ్ బాలు చౌహన్, అధ్యక్షులుగా గాడిపెల్లి సతీష్, ఉపాధ్యక్షులు మట్ట సైదులు, ప్రధాన కార్యదర్శి తోట సురేష్, కోశాధికారి జలగం నరేందర్ గౌడ్, గౌరవ సలహాదారులుగా డి. వై. గిరి ఎన్నికైన్నారు. ఈ సందర్బంగా తెలంగాణ రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ కి ఎన్నికైన కార్యవర్గం కృతజ్ఞతలు తెలిపింది. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ జిల్లాలోని మండల స్థాయి కబడ్డీ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు, సీనియర్ కబడ్డీ క్రీడాకారులు, మాజీ క్రీడాకారులు, క్రీడా ఉద్యోగులు, క్రీడా అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

