Type Here to Get Search Results !

తీన్మార్ మల్లన్న భారీ మెజార్టీతో గెలిపిస్తాం-...బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రాజశేఖర్

 నమస్తే మానుకోట న్యూస్ నర్సింహులపేట


ఉమ్మడి వరంగల్,ఖమ్మం,నల్లగొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో అత్యధిక మెజార్టీతో తీన్మార్ మల్లన్నను గెలిపించాలని మరిపెడ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రాజశేఖర్ పట్టబద్రులకు పిలిపు నిచ్చారు. మండల కేంద్రంలో శుక్రవారం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల కోఆర్డినేటర్ల సమావేశంలో వారు మాట్లాడారు.

 ఈ నెల 27వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్నను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు.బీజేపీ,బీఆర్ఎస్ అభ్యర్థులు నాయకులు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కు పోటీగా ఎక్కడాలేరన్నారు.ఎంపీ ఎన్నికలలో బలరాం నాయక్ కోసం నిరంతరం పని చేశామని,ఇప్పుడు ఎమ్మెల్సీగా తీన్మార్ మల్లన్నను గెలిపించటం కోసం పనిచేసి భారీ మెజార్టీ ఇస్తామన్నారు.ఎంపీ బలరాం నాయక్ మరియు ఎమ్మెల్సీ తీన్మార్ మలన్న ఆధ్వర్యంలో మరిన్ని నిధులు తీసుకుని వచ్చి డోర్నకల్ నియోజకవర్గంను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామన్నారు.మల్లన్న కోసం ప్రతి ఒక్క కార్యకర్త సైనికుడిలా కష్టపడి పని చేసి భారీ మెజార్టీతో గెలిపించుకుందామన్నారు.

 రానున్న రోజుల్లో మరిన్ని ఉద్యోగాలు ఇస్తామని ఉద్యోగ క్యాలెండర్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటిస్తుందని ఆశ భావం వ్యక్తం చేశారు. యువతకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందని త్వరలోనే మూసిన ప్రభుత్వ పాఠశాలలను తెరిపించే విద్యాభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కృషి చేస్తుందని వారన్నారు. రానున్న పట్టభద్రుల ఎన్నికల్లో విజయం సాధించి ప్రభుత్వం తరఫున మరిన్ని అభివృద్ధి పథకాలు ప్రవేశ పెట్టడం ఖాయమని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు రామకృష్ణ ప్రధాన కార్యదర్శి యాదగిరి యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సతీష్ గౌడ్, వంతడపుల గ్రామ పార్టీ అధ్యక్షులు వెంకన్న గుగులోత్ వీరన్న అనిల్ కుమార్ యాదవ్ గ్రామ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కసా యాకన్న డోనికన ఉపేందర్ నాయకులు లింగన్న యాదవ్ ఉపేందర్ సురేష్ నాయక్ శ్రీను యాదవ్ రమేష్ సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.