Type Here to Get Search Results !

TSకి బదులు TG గా మార్పు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు పాటించాలి.. జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్

 నమస్తే మానుకోట న్యూస్ మహబూబాబాద్


రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు ననుసరించి TS కి బదులుగా TG అని మార్చాలని ప్రభుత్వ శాఖల అధికారులు, 

పి ఎస్ యు, ప్రభుత్వ రంగ సంస్థలు, ఏజెన్సీలు పేర్లులో  టిఎస్ బదులుగా టిజిగా మార్చాలని జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఆదేశించారు. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర అబ్రియేషన్స్ గా సూచించే 'టీఎస్' స్థానంలో టీజీని వినియోగించేందుకు కేంద్రం అనుమతిస్తూ గెజిట్ జారీ చేసినట్లు తెలిపారు.

 మార్చి నెలలో వాహనాల రిజిస్ట్రేషన్ కు సంబంధించిన అనుమతులు రాగా, తాజాగా అన్ని ప్రభుత్వ వ్యవహారాల్లో టీఎస్ కు బదులుగా టీజీని వినియోగించేందుకు అనుమతి జారి చేసినట్లు తెలిపారు.

 రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ సంస్థలు, పీఎస్ యులు, ఏజెన్సీల పేర్ల ముందు టిఎస్ కు బదులు టిజి గా మార్చాలని ఆదేశించారు.

ఉదాహరణకు టీఎస్ఎన్పిడిసిఎల్ పేరును ఇక నుండి టిజిఎన్పిడిసిఎల్ గాను, టీఎస్ఆర్టీసీ పేరును 

టిజిఆర్టీసీగా మార్చాలని అన్ని ప్రభుత్వ శాఖల అధికారులకు శనివారం సర్క్యులర్ జారీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. 

జిల్లాలోని పబ్లిక్ సెక్టార్ యూనిట్లు, ఏజెన్సీలు, స్వయంప్రతిపత్తి గల సంస్థలు, ప్రభుత్వ సంస్థలన్నీ ఇకపై వాటి పేర్లను టిజితో ప్రారంభమయ్యేలా మార్చుకోవాలని ఆయన సూచించారు. లెటర్ హెడ్లు, రిపోర్టులు, నోటిఫికేషన్లు, అధికారిక వెబ్ సైట్లు, ఆన్లైన్ ఫ్లాట్ ఫామ్ లు ,పాలసీ పేపర్లు, జీవోలు, ఇతర అధికారిక 

కమ్యూనికేషన్లన్నింటిపై టీఎస్ స్థానంలో టీజీగా మార్చాలని ఆయన పేర్కొన్నారు. 

 ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు తీసుకున్న చర్యలపై ఈ నెల 25వ తేదీలోపు అన్ని శాఖల అధికారులు నివేదికలు పంపాలని, అట్టి నివేదికలు క్రోడీకరించి ప్రభుత్వానికి నివేదికలు పంపనున్నట్లు ఆయన అన్ని శాఖల అధికారులను ఆదేశించారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.