నమస్తే మానుకోట న్యూస్ నర్సింహులపేట
రానున్న పట్టభద్రుల ఖమ్మం వరంగల్ నల్లగొండ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఇతర వామపక్ష భావజాల సంస్థలు, మేధావులు బలపరిచిన అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని నర్సింహులపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రమేష్ పిలుపునిచ్చారు.
శనివారం జిల్లా కాంగ్రెస్ పార్టీ, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్రనాయక్ పిలుపుమేరకు మండలంలోని పడమటి గూడెం వంతడుపుల గోపాతండా నరసింహులపేట కొమ్ములవంచ గ్రామాల పరిధిలో పట్టబద్రులను కలిసి ఓట్లు అభ్యర్థించారు. ఉద్యోగుల కోసం మల్లన్న గత కొద్ది సంవత్సరాలుగా నిరుద్యోగుల సమస్యల పైన అధికార టిఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాలు నిర్వహించారని వారు పేర్కొన్నారు. కెసిఆర్ అవినీతి పైన గొంతు ఎత్తిన వ్యక్తి మల్లన్న ఓటు వేసి గెలిపిస్తే ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రజా గొంతుకగా నిలుస్తారని వారన్నారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజశేఖర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి లింగారెడ్డి వివిధ గ్రామ పార్టీల అధ్యక్షులు ఉప్పల్లయ్య రామకృష్ణ రాజేందర్ నాయక్ కమటం వెంకన్న మల్లయ్య యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సతీష్ గౌడ్ దేవీలాల్ నాయక్ యాకన్న శ్రీకాంత్ లింగన్న ఉపేందర్ రామన్న రమేష్ అనిల్ ప్రతాప్ ఉపేందర్ సోమిరెడ్డి మహబూబ్ బాషాతదితరులు పాల్గొన్నారు.


