Type Here to Get Search Results !

పుచ్చలపల్లి సుందరయ్య కమ్యూనిస్టు నాయకుడు, తెలంగాణా రైతాంగ సాయుధ పోరాట వీరుడు, స్వాతంత్ర్య సమర యోధుడు.

 నమస్తే మానుకోట న్యూస్ మహబూబాబాద్


 పుచ్చలపల్లి సుందరయ్య స్వాతంత్ర్య సమర యోధుడు, కమ్యూనిస్టు నాయకుడు, తెలంగాణా

రైతాంగ సాయుధ పోరాట వీరుడు, సమసమాజం కోసం పోరాడిన

విప్లవకారుడు. కులవ్యవస్థను నిరసించి పేరులో కులాన్ని సూచించే పదాన్ని

తొలగించుకున్న ఆదర్శవాది. ఉద్యమాల కోసం

తన వాటా కింద వచ్చిన యావదాస్తిని ప్రజా పోరాటాల కోసం ఖర్చు

చేసిన మార్గదర్శి.

ప్రజలకు, పార్టీకి పూర్తి కాలం ప్రజలకు, పార్టీకి సేవలు అందించాలనే

ఉద్దేశంతో పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకున్న గొప్ప త్యాగశీలి.

| తెలంగాణా రైతాంగ సాయుధ పోరాట యోధుడు. ఇలా పేర్కొంటూ

వెళితే, పేజీలు చాలవు. ఆయనే కామ్రేడ్ "పి.ఎస్" గా పిలువబడిన,

“కమ్యూనిస్టు గాంధీ”గా పేరొందిన పక్కా కమ్యూనిస్టు యోధుడు పుచ్చలపల్లి

| సుందరయ్య. ప్రపంచ కార్మిక దినోత్సవం రోజున జన్మించి, కమ్యునిజాన్ని

ఔపోసన పట్టి, కన్ను మూసే వరకు ఆ భావజాలంలోనే కొనసాగిన పోరాట

యోధుడు.

పుచ్చలపల్లి సుందరయ్య, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విడవలూరు

మండలం, అలగానిపాడు గ్రామంలో ఒక భూస్వామ్య కుటుంబంలో 1913,

మే 1 న జన్మించారు. తండ్రి వెంకటరామిరెడ్డి, తల్లి శేషమ్మ. తల్లిదండ్రులు

సుందరరామిరెడ్డి అని పేరు పెట్టారు. ఆరేళ్ళ వయసులో తండ్రి మరణించగా,

ప్రాథమిక విద్యను వీధిబడిలోనే, తరువాత తిరువళ్ళూరు, ఏలూరు,

రాజమండ్రి, మద్రాసు లలో చదివారు.

గాంధీజీ నాయకత్వం పట్ల ఆకర్షితులై, సుందరయ్య 1930లో తన 17వ

యేట ఉన్నత పాఠశాల రోజుల్లోనే స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నారు.

సైమన్ కమిషన్ వ్యతిరేక ప్రదర్శనలలోను, ఉప్పు సత్యాగ్రహం లోను,

| సహాయ నిరాకరణోద్యమం లోను పాల్గొని కారాగార శిక్ష అనుభవించారు.

అతనిని నిజామాబాద్, బోర్బల్ స్కూలులో ఉంచారు. ఆ సమయంలో

ఆయనకు కమ్యూనిస్టులతో పరిచయం ఏర్పడింది. విడుదల అయినాక తన

స్వగ్రామంలో వ్యవసాయ కార్మికులను సంఘటితం చేయడానికి కృషి చేశాడు.

అమీర్ హైదర్ ఖాన్ స్ఫూర్తితో సుంద సమయంలో పార్టీ నాయకత్వంలో అధికుల (డాంగే వర్గం) ధృక్పథాన్ని

వ్యతిరేకిస్తూ, తన బాధ్యతలన్నింటికీ రాజీనామా చేశారు. 1962

నవంబరులో, చైనా యుద్ధం సమయంలో సుందరయ్యను అరెస్టు చేశారు.

"తెలంగాణా ప్రజల పోరాటం - దాని పాఠాలు" అన్న నివేదికలో

సుందరయ్య అప్పటి పరిస్థితులనూ, పార్టీ విధానాలనూ, పోరాట క్రమాన్నీ

విశదంగా విశ్లేషించాడు. సుందరయ్య తయారు చేసిన ఈ నివేదికను

భారతీయ కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) 1972 డిసెంబరు నెలలో విడుదల

చేసింది.

అక్టోబరు - నవంబరు 1964 లో జరిగిన 7వ పార్టీ కాంగ్రెస్లో భారతీయ

కమ్యూనిస్టు పార్టీ చీలిపోయింది. అందులో లెఫ్టిస్టులన బడేవారు భారతీయ

కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) పేరుతో క్రొత్త పార్టీగా ఏర్పడ్డారు. ఆ పార్టీకి

సుందరయ్య సాధారణ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఈ సమావేశం జరిగిన

ఆ కొద్ది కాలంలోనే భారత జాతీయ కాంగ్రెసు ప్రభుత్వం అనేక మంది సి.పి.ఐ-

ఎమ్ నాయకులను అరెస్టు చేసిన సమయంలో సుందరయ్య మే 1966

వరకు నిర్బంధంలో ఉన్నారు. 1975 - 1977 కాలంలో ఇందిరా గాంధీ

ప్రభుత్వం అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ)ని ప్రకటించి నపుడు అరెస్టును

తప్పించు కోవడం కోసం సుందరయ్య అజ్ఞాతంలోకి వెళ్ళారు.

1976 వరకు సుందరయ్య సి.పి.ఐ-ఎమ్ పార్టీ సాధారణ కార్యదర్శిగా

కొనసాగారు. 1976 లో, ఎమర్జెన్సీ కొనసాగుతున్న సమయంలో, పార్టీలో

"రివిజనిస్టు” భావాలను వ్యతిరేకిస్తూ సుందరయ్య సాధారణ కార్యదర్శి

పదవికి, పాలిట్ బ్యూరో సభ్యత్వానికి రాజీనామా చేశారు.

1952 లో సుందరయ్య మద్రాసు నియోజక వర్గం నుండి పార్లమెంటు

రాజ్యసభకు ఎన్నికయ్యారు. పార్లమెంటులో కమ్యూనిస్టు వర్గానికి

నాయకుడయ్యారు. తరువాత రాష్ట్ర శాసనసభకు ఎన్నికై, 1967 వరకు

శాసన సభా సభ్యునిగా కొనసాగారు. కొంత కాలం విరామానతరం 1978

లో శాసన సభకు ఎన్నికై, 1983 వరకు కొనసాగారు.

లీలా అనే సెంట్రల్ బ్యాంక్ ఉద్యోగిని 1943 ఫిబ్రవరి 27న పార్టీ ప్రధాన

కార్యదర్శి పీసీ జోషీ, మరికొద్ది మంది పార్టీ నేతల సమక్షంలో వివాహం

చేసుకుని, 1944 చివర్లో పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించు కోవడం

ఆయన కుల పక్షపాత రాహిత్యాన్ని స్పష్టం చేస్తుంది.

తెలుగునాట కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతలలో ప్రముఖుడై, కుల వ్యవస్థను

నిరసించిన పుచ్చలపల్లి సుందర రామిరెడ్డి... కులాన్ని సూచించే రెడ్డి తోక

పదాన్ని పూర్తిగా తొలగించుకున్న ఆదర్శ మూర్తి.

పార్లమెంటు భవననానికి రాష్ట్ర విధానసభకు వెళ్ళినపుడు సైకిలును ఉ

పయోగించడాన్నిబట్టి ఆయన నిరాడంబరత తేటతెల్లం అవుతుంది.

పేదరికం, దోపిడీ నుంచి పేదల విముక్తికి జీవితాన్ని అంకితం చేసిన

సుందరయ్య 1985, మే 19న పుచ్చలపల్లి కన్నుమూశారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.