నమస్తే మానుకోట న్యూస్ మహబూబాబాద్
మహబూబాబాద్ మండలం లోని గడ్డి గూడెం తండ, మరిపెడ మండలం బాల్య తండ గ్రామపంచాయతీ ల యందు EGS పని ప్రదేశాలను సందర్శించడం జరిగింది. అనంతరం మధ్యాహ్నం IDOC కార్యాలయం నందు అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ లెనిన్ వత్సల్ టోప్పో అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది.
ఈ సందర్బంగా మెంబర్ సెక్రటరీ మాట్లాడుతూ "EGS పని ప్రదేశం నందు గ్రామ పంచాయతీ ద్వారా మౌళిక సౌకర్యాలు (నీడ, నీరు, ప్రథమ చికిత్స పెట్టె) కల్పించాలని, అదేవిధముగా ప్రతి కూలీకి రోజుకు 300 రూపాయలు కూలీ పడే విధముగా పని చేయించాలని ఆదేశించారు".
అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ,"ప్రతి ఎంపిడిఓ గ్రామ స్థాయిలో MGNREGS parametre లపై ప్రణాళికలు సిద్ధం చేసుకొని కూలీలకు గరిష్ఠ వేతనం పడేలా తగు చర్యలు తీసుకోవలసిందిగా ఆదేశించడం జరిగింది".
జడ్.పి. సి.ఇ.ఓ మాట్లాడుతూ,"EGS పని ప్రదేశం నందు పని కొలతలను ముందస్తుగా మార్కింగ్ చేసి, పని చేయించాలని తెలపడం జరిగింది".
DPO హరి ప్రసాద్ మాట్లాడుతూ,"EGS నందు నిర్మించిన సెగ్రిగేషన్ షెడ్ లను పూర్తి స్థాయిలో ఉపయోగములోకి తీసుకురావాలని తెలపడం జరిగింది."
ఈ కార్యక్రమంలో Addl.DRDO శాంతకుమారి, అంబుడ్స్ పర్సన్ ఆదెం,అబేద్ ఖాన్, ఎంపిడిఓ లు, ఎంపీవో లు, ఏపిఓ లు, ఈసీ లు, సాంకేతిక సహాయకులు, DRDA సిబ్బంది పాల్గొన్నారు.


