Type Here to Get Search Results !

స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించుటకు అన్ని ఏర్పాట్లు పూర్తి..... జిల్లా ఎన్నికల అధికారి అద్వైత్ కుమార్ సింగ్.

 నమస్తే మానుకోట న్యూస్ మహబూబాబాద్


కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం పార్ల మెంటు ఎన్నికలను స్వేచ్ఛాయుత, ప్రశాంత, పార దర్శక వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, అద్వైత్ కుమార్ సింగ్ అన్నారు.

మహబూబాబాద్ ఎస్టీ పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో 23 మంది అభ్యర్థుల నామినేషన్లు వేసి ఎన్నికల బరిలో ఉన్నారు.

పార్లమెంట్ నియోజకవర్గం లో గల 1809 పోలింగ్ కేంద్రాలకు ప్రతి పోలింగ్ కేంద్రానికి రెండు బ్యాలెట్ యూనిట్ల చొప్పున ఏర్పాటు చేశామన్నారు.  

2024 ఏప్రిల్ 25 తుది ఓటర్ల జాబితా ప్రకారం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 15,32,366 ఓటర్లు 1,492 మంది సర్వీస్ ఓటర్లు ఉన్నారన్నారు. ఏప్రిల్ నెల 25 నుండి బి ఎల్ వో ల ద్వారా ఇంటింటికి ఓటర్ సమాచార స్లిప్స్ పంపిణీ చేయడం జరిగిందని, ఓటర్ స్లిప్ లలో ఓటరు తన ఓటు హక్కును ఏ పోలింగ్ స్టేషన్కు వెళ్లి వినియోగించుకోవాలో మ్యాప్, లోకేషన్ సమగ్ర సమాచారం అందులో ఉంటుందని, మే 8వ తేదీలోగా ఓటరు స్లిప్ల పంపిణీ జరిగి ప్రతి ఓటర్ కు చేరేలా జిల్లా స్థాయి అధికారులను నియమించి పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. వీరికి పోల్ స్లిప్స్ అందించడం జరిగింది. ఓటరు స్లిప్పులు అందని వారు ఎన్నికల సంఘం ధృవీకరించిన 14 ధృవపత్రాలలో ఏదైనా ఒక గుర్తింపు కార్డు చూపించి ఓటును వినియోగించు కావాలని జిల్లా ఎన్నికల అధికారి పేర్కొన్నారు.

ఓటర్ ఐడి కార్డ్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, యూనిక్ డిసబిలిటీ ఐడి కార్డ్, సర్వీస్ ఐడెంటిటీ కార్డ్ బ్యాంక్/పోస్ట్ ఆఫీస్ ఫోటో తో సహా జారీ చేసిన పాస్ బుక్, హెల్త్ ఇన్సూరెన్స్ స్మార్ట్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్ ఎన్పీఆర్ కింద ఆర్.జి ఐ ద్వారా జారీ చేయబడిన స్మార్ట్ కార్డ్, పెన్షన్ డాక్యుమెంట్, ఎంపీలకు ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు జారీ చేయబడిన అఫీషియల్ ఐడి కార్డ్, MNREGA జాబ్ కార్డ్ ఉపయోగించి ఓటును సద్వినియోగం చేసుకోవాల్సిందిగా జిల్లా ఎన్నికల అధికారి అన్నారు.

పార్లమెంట్ నియోజకవర్గం 1809 పోలింగ్ కేంద్రాలలో దివ్యాoగులు, వయోవృద్ధుల సౌకర్యవంతంగా ఓటు వేసేలా అన్ని పోలింగ్ కేంద్రాలలో సౌకర్యాలు కల్పించడం జరిగిందన్నారు. దీనికితోడుగా పార్లమెంట్ పరిధిలో గల 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో యువ, దివ్యాoగ, మహిళ మోడల్ పోలింగ్ కేంద్రాల ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

పార్లమెంట్ నియోజకవర్గంలోని 317 సమస్యాత్మకంగా పోలింగ్ కేంద్రాలను గుర్తించి, 1159 పోలింగ్ కేంద్రాలలో లైవ్ వెబ్ కాస్టింగ్, ఇంటర్నెట్ సౌకర్యం లేని 62 పోలింగ్ కేంద్రాలలో వీడియో చిత్రీకరణ ఏర్పాట్లు చేయడం జరిగింది. 650 పోలింగ్ కేంద్రాల బయట సీసీటీవీ కవరేజ్, 317 మైక్రో అబ్జర్వర్లు, అధిక భద్రత సిబ్బంది ద్వారా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామన్నారు.

మే 13 వ తేదీన జరిగే పోలింగ్ కు సుమారు 8,683 మంది పోలింగ్ సిబ్బందిని కేటాయించడంతో పాటు 20 శాతం అదనంగా కేటాయించారన్నారు. మొదటి, రెండవ, 3వ శిక్షణ పూర్తయిందని, ర్యాoడమైజెషన్ ద్వారా పోలింగ్ కేంద్రాల వారిగా సిబ్బందిని కేటాయించామన్నారు.

మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ను పకడ్బందీగా అమలు చేస్తూ 7 అసంబ్లీ సెగ్మెంట్లలో 22 ఎఫ్.ఎస్.టి, 22ఎస్.ఎస్.టి, 16 వి.ఎస్.టి బృందాల ద్వారా నిత్యం నిఘా ఉంచడం జరిగిందన్నారు. ఇప్పటివరకు 2,09,05,160 విలువగల నగదు, బంగారం, గాంజా, లిక్కర్ ఇతర వస్తువుల ను సీజ్ చేయడం జరిగిందని అన్నారు. ఎన్నికల ప్రవర్తన నియ హిమావళిని ఉల్లంఘించిన వ్యక్తుల పై ఎఫ్ఐఆర్ లు నమోదు చేయడం జరిగిందని అన్నారు.

జిల్లా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ 1950 ఏర్పాటు చేసి ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించడం జరుగుతుందన్నారు. సి విజిల్ ద్వారా 50 ఫిర్యాదులు రాగా 100 నిమిషాలలో 50 ఫిర్యాదులు పరిష్కరించడం జరిగిందన్నారు. 

ఫారం 12 డి క్రింద 85 సంవత్సరాలు పైబడ్డ ఓటర్లు 360 మంది, 361 మంది దివ్యంగ ఓటర్లకు ముందుగా హోమ్ వోటింగ్ ద్వారా మే 3 నుండి 8 వరకు ఓటు వేసేలా ప్రణాళిక ప్రకారం బృందాలను నియమించి హోం ఓటింగ్ ప్రశాంతంగా ముగిసిందన్నారు. 

 అదేవిధంగా ఎన్నికలలో విధులు నిర్వహించే దాదాపు 1391 ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా, 86 మంది అత్యవసర ఓటర్ల జాబితాలో ఫామ్ 12 ద్వారా నమోదు చేసుకున్నారని వారందరికీ ఓటు హక్కు వినియోగించుటకు ప్రతి ఏ ఆర్ ఓ పరిధిలోని నిర్దేశిత ప్రాంతంలో ఫెసిలిటేషన్ కేంద్రాల ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్నారని పేర్కొన్నారు.

స్వీప్ ద్వారా వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తూ పట్టణ ముఖ్య కూడళ్లలో కళాకారుల ద్వారా ఓటరు అవేర్నెస్ కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఓటు శాతం పెంచడానికి స్వీప్ రన్ నిర్వహించినట్లు తెలిపారు. మొదటి విడత ఎన్నికల నుండి చివరి విడత ఎన్నికల వరకు ఎగ్జిట్ పోల్ పై నిషేధం ఉందన్నారు. జూన్ 4 వ తేదీన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ సాంఘీక సంక్షేమ జూనియర్ (బాలికల) కళాశాలలో జరిగే కౌంటింగ్ ప్రక్రియను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.