మానుకోటలో సిపిఐ పార్లమెంటరీ స్థాయి ఎన్నికల సభను జయప్రదం చేయండి.
-నల్లు సుధాకర్ రెడ్డి సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు.
(నమస్తే మానుకోట-చిన్నగూడూరు)
ఇండియా కూటమి అభ్యర్థి బలరాం నాయక్ గెలుపు కోసం ఈ నెల 3న మానుకోటలో సిపిఐ నిర్వహించే పార్లమెంటరీ స్థాయి సభను జయప్రదం చేయాలని సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు నల్లు సుధాకర్ రెడ్డి పిలుపునిచ్చారు.చిన్న గూడూరు మండల కేంద్రంలో జరిగిన పార్టీ కార్యవర్గ సమావేశంలో నల్లు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా కేంద్రంలో పాలన గావిస్తున్న బిజెపి నిత్యవసర వస్తువుల ధరలు తగ్గించకపోగా, యువతకు ఉపాధి అవకాశాలను కల్పించడంలో పూర్తిగా విఫలమై, వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టడానికి మూడు నల్ల చట్టాలను తీసుకొచ్చి, దేశ సంపదను కారు చౌకగా కార్పొరేట్ శక్తులకు బరితెగించి కట్టబెడుతు, మత విద్వేషాలను రెచ్చగొట్టి మరోసారి అధికారంలోకి రావడానికి ప్రయత్నించే బిజెపికి, తెర వెనక మిత్రుడైన నియoత్రుంత బిఆర్ఎస్ కు ఈ ఎన్నికలలో తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. మే 3న మానుకోట బాలాజీ గార్డెన్ లో జరిగే పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనo నేని హాజరుకానున్నారని అన్నారు.

