ఉపాధి కూలీల వేతనాలను 500రూ.లకు పెంచాలి.
-ఎఐకెఎంఎస్ డివిజన్ అధ్యక్షుడు ఊడుగుల లింగన్న.
(నమస్తే మానుకోట-దంతాలపల్లి)
ఉపాధి హామీ కూలీల వేతనాలను వెంటనే చెల్లించాలని, కొలతలతో సంబంధం లేకుండా 500 రూపాయల వేతనాన్ని కేటాయించాలని ఏఐకేఎంఎస్ డివిజన్ అధ్యక్షుడు ఊడుగుల లింగన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దంతాలపల్లి మండల బిరిశెట్టిగూడెం గ్రామంలో క్షేత్రస్థాయిలో ఉపాధి హామీ పనులు జరుగుతున్న ప్రదేశాన్ని చేరుకుని ,ఉపాధి హామి కూలీలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా లింగన్న మాట్లాడుతూ కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి హామీ నిధులను తగ్గిస్తూ,పథకాన్ని రద్దు చేసే కుట్రలు చేస్తుందన్నారు. కూలీలకు కనీస వేతనం కింద 500 రూపాయలు, పని ప్రదేశంలో త్రాగునీరు, మెడికల్ కిట్, నీడ వసతి ఏర్పాటు చేయాలని సూచించారు.ప్రతి గ్రూపుకు ఒక మేట్ ని ఏర్పాటు చేయాలని,జాబ్ కార్డు లేని ప్రతి ఒక్కరికీ తక్షణమే కార్డులు మంజూరు చేయాలని కనీస ఉపాధి హామీ రోజులను 100 నుండి 200 రోజులకి పెంచాలని డిమాండ్ చేశారు. వేసవిలో ఎండలను దృష్టిలో పెట్టుకొని కొలతలతో సంబంధం లేకుండా కనీసం 500 రూపాయలు చెల్లించాలని,ప్రమాదవశాత్తు కూలీలకు ప్రమాదం సంభవిస్తే వారికి ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించాలి డిమాండ్ చేశారు. పని ప్రదేశంలో మరణిస్తే మరణించిన వ్యక్తి కుటుంబానికి ప్రభుత్వం 50 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని వారం వారం క్రమం తప్పకుండా మాష్టర్ స్లిప్ లు అందించాలని రెండు వారాలకు ఒక్కసారి డబ్బులు పడేవిధంగా చూడాలన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూడె మోక్రసీ దంతాలపల్లి సబ్ డివిజన్ కార్యదర్శి చిర్ర యకన్న, పివైఎల్ జిల్లా నాయకులు రాజశేఖర్,పి డిఎస్యు జిల్లా నాయకులు గోడిశాల మనోజ్, స్థానిక ఫీల్డ్ అసిస్టెంట్ జగన్, ఉపాధి కూలీలు భూతం మంగమ్మ తదితరులు పాల్గొన్నారు.

