నమస్తే మానుకోట న్యూస్
మహబూబాబాద్ జిల్లా ప్రధాన మరియు సెషన్స్ కోర్ట్ సంచలన తీర్పు.... గంజాయి కేసులో ఇద్దరు నిందితులకు 10 సంవత్సరాల జైలు శిక్ష....
ఒకేసారి నిందితులకు లక్ష రూపాయల జరిమాన, జరిమాన కట్టని యెడల అదనంగా మరో ఆరు నెలల జైలు శిక్ష విధించిన ప్రధాన న్యాయమూర్తి పసుపులేటి చంద్రశేఖర్ ప్రసాద్...*
జిల్లా చరిత్రలో అనతి కాలంలోనే జిల్లాలో సంచలన తీర్పులు ఇచ్చిన ప్రధాన న్యాయమూర్తి పసుపులేటి చంద్రశేఖర్ ప్రసాద్.......
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో సుమారు 40 కేజీల గంజాయి స్వాధీనం చేసుకుని ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని మరిపెడ పోలీసులు పరిశీలించిన పిదప (FIR NO:212/2021)కేసు నమోదు చేసి కోర్టులో దావా దాఖలు చేయగా మహబూబాబాద్ జిల్లా కోర్టు విచారణ అనంతరం మహబూబాబాద్ జిల్లా
ప్రధాన న్యాయమూర్తి, మరిపెడబంగ్లాకు చెందిన బ్రమవత్ రాములుకి,భూక్యా సురేష్ అనే ఇద్దరు నిందితులకు10 సంవత్సరాల జైలు శిక్ష లక్ష రూపాయల జరిమాన, జరిమాన కట్టని యెడల అదనంగా మరో ఆరు నెలల జైలు శిక్ష విధించిన ప్రధాన న్యాయమూర్తి పసుపులేటి చంద్రశేఖర్ ప్రసాద్ శిక్ష విధించినట్లు కోర్టు సంబంధిత అధికారులు తెలిపారు.



