◆కంఠమహేశ్వరుడి బోనాలకు సర్వం సిద్ధం.
◆గుండంరాజుపల్లిలో బోనాలను సిద్ధం చేస్తున్న గౌడన్నలు.
(చిన్నగూడూరు-నమస్తే మానుకోట)
మహబూబాబాద్ జిల్లా చిన్నగూడురు మండలం గుండంరాజుపల్లి గ్రామంలో కంఠమహేశ్వరుడి మహోత్సవం కన్నుల పండుగగా జరుగుతోంది. నిన్న కంఠమహేశ్వరుడికి జలాభిషేకం జరగగా ఇవాళ స్వామివారికి బోనాల సమర్పించేందుకు సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆడపడుచులు బోనాలకు అలంకరణ తర్వాత... ఇంటి నుంచి ర్యాలీగా బయలుదేరి స్వామివారికి బోనాలు సమర్పించనున్నారు. ఇందుకోసం గుండంరాజుపల్లి గ్రామంలో భారీ ఏర్పాట్లు చేశారు.

