◆కంఠమహేశ్వరుడికి కన్నుల పండుగగా జలాభిషేకం.
◆ఆకట్టుకున్న జల కడవల ర్యాలీ.
◆మంగళహారతులతో ర్యాలీలో పాల్గొన్న మహిళలు.
◆గుండంరాజుపల్లిలో వైభవంగా కంఠమహేశ్వరుడి మహోత్సవం.
(చిన్న గూడూరు-నమస్తే మానుకోట)
చిన్నగూడురు మండలం గుండంరాజుపల్లి గ్రామంలో కంఠమహేశ్వరుడి మహోత్సవం కన్నుల పండుగగా జరుగుతోంది. కంఠమహేశ్వరుడికి జలాభిషేకం కార్యక్రమంలో భాగంగా గౌడ కులస్తులు కంఠమహేశ్వరుడికి జలాభిషేకం నిర్వహించారు. ఇందులో భాగంగా ఆడపడచులతో జల కడవల అలంకరణ తర్వాత... ఇంటి పురుషులు జల బిందెలతో ర్యాలీగా బయలుదేరగా... మంగళహారతులతో మహిళలు పాల్గొన్నారు. ఈసందర్భంగా డప్పు చప్పుళ్ల నృత్యాలు ఆకట్టుకున్నాయి. అనంతరం ఊరు తాటివనంలోని కంఠమహేశ్వరుడి గుడిలో స్వామివారికి ఘనంగా జలాభిషేకం నిర్వహించారు. జెట్టి పూజారుల సమక్షంలో పూజకార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.



