(నమస్తే మానుకోట న్యూస్ నర్సింహులపేట)
నర్సింహులపేట మండలం జయపురం గ్రామంలో ప్రతి సంవత్సరం వేసవి వాలీబాల్ శిక్షణ శిబిరం40 రోజుల పాటు శ్రీరామ్ సిటీ యూనియన్ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వంగల ప్రవీణ్ కుమార్, గ్రామస్థుల ఆర్థిక సహకారంతో కీర్తిశేషులువంగాల సుదర్శన్ రెడ్డి, వంగాల రాంచంద్రారెడ్డివారిజ్ఞాపకార్థం రిటైర్డ్ వ్యాయామ ఉపాధ్యాయుడు కోచ్ నెలకుర్తి వీరారెడ్డి ఆధ్వర్యంలో వాలీబాల్,టేబుల్ టెన్నిస్ సమ్మర్ క్యాంపును 27-04-2024నుండి 09-06-2024 వరకు నిర్వహించనున్నారు.
ఈ వేసవి వాలీబాల్ శిక్షణ శిబిరంప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా నర్సింహులపేట ఎస్సై గండ్రాతి సతీష్ పాల్గొనిక్రీడాకారుల నుంచి గౌరవ వందనం స్వీకరించివాలీబాల్ వేసవి శిక్షణ శిబిర క్రీడ క్యాంపును ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎస్పై మాట్లాడుతూ చిన్నారులు వేసవి సెలవులను ప్రణాళిక ప్రకారం తమకు నచ్చిన ఆటల్లో నేర్పరులుగా తయారయేందుకు సమ్మర్ కోచింగ్ క్యాంపును వినియోగించుకోవాలన్నారు. వేసవి సెలవుల్లో నచ్చిన ఆటలో ఆరితేరేలా సమ్మర్ కోచింగ్ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల్లో దాగి ఉన్న నైపుణ్యతలను వెలికితీసేందుకు కృషి చేయాలన్నారు. క్రీడల
పట్ల ఆసక్తి కలిగిన వారిని ఆ దిశలో ప్రోత్సహిస్తే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను చేరుకుంటారన్నారు. క్రీడలతో మానసిక, శారీరక ఉల్లాసం చేకూరుతుందన్నారు ఈ సమ్మర్ క్యాంపుకు వచ్చే క్రీడాకారులకు ప్రతిరోజు అల్పాహారం ఇవ్వడానికి తమ వంతు సహాయ సహకారాలు అందించిన రిటైర్డ్ వ్యాయామ ఉపాధ్యాయులు రఘత్తమ్ రెడ్డి, నారాయణరెడ్డి, ఉప్పల్ రెడ్డి ఈ సమ్మర్ క్యాంపుకు ఆర్థిక సహాయం అందించారు యూత్ సర్వీస్ కోఆర్డినేటర్అనిల్ కుమార్ ఈ వేసవి శిక్షణ శిబిరానికి క్రీడా సామాగ్రిని అందించడం జరిగినది. ఈ కార్యక్రమంలో
స్కూల్ హెచ్ యం రాగిణి, గ్రామ నాయకులు సత్తిరెడ్డి, అశోక్ రెడ్డి, లింగారెడ్డి, ఎస్ఎంసి చైర్మన్ రావుల శ్రీను, వ్యాయామ
ఉపాధ్యాయులు రఘోత్తమ్ రెడ్డి, ఉప్పల్ రెడ్డి, నారాయణరెడ్డి, శ్రీరామ్ సిటీ ఫైనాన్స్ రివిజనల్మేనేజర్ ఇమామ్ పాషా, జిఎం శ్రీనివాస్ రెడ్డి, సత్తిరెడ్డి, మోహన్ రెడ్డి, గ్రామస్థులు శేఖర్, విజయ్, రాంముర్తి, వెంకట్మల్లు, ఉపెందర్, గోవర్ధన్ రెడ్డి విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

.jpg)
