నమస్తే మానుకోట న్యూస్ నర్సింహులపేట
మరిపెడ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ పరిధిలో సోమవారం మంచినీటి సరఫరా నిలిచిపోతుందని మహబూబాబాద్ జిల్లా మిషన్ భగీరథ గ్రిడ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏ. సురేందర్ తెలిపారు.
మరిపెడ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ కు నీటిని అందించే పాలేరు రిజర్వాయర్ వద్ద ప్రధాన పైప్ లైన్లకు సంబంధించి మరమ్మతు పనులు నెలకొన్న నేపథ్యంలో నీటి సరఫరా నిలిచిపోనుందని చెప్పారు. మహబూబాబాద్ జిల్లాలోని అన్ని గ్రామాలతో పాటు వరంగల్ జిల్లా పరిధిలోని రాయపర్తి, నర్సంపేట డివిజన్ లో అన్ని గ్రామాలు, ఆవాసాలకు సోమవారం మంచినీటి సరఫరా నిలిచిపోనుందన్నారు. అన్ని పంచాయతీల కార్యదర్శులు, ప్రత్యేక అధికారులు ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుని స్థానికంగా నీటి సరఫరాకు ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ అసౌకర్యానికి ప్రజలు సహకరించాలని కోరారు.

