Type Here to Get Search Results !

దంతాలపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను సందర్శించి గ్లూకోస్ బాటిల్ లో ఫంగస్ వార్తా పై దర్యాప్తు చేసిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కళావతి భాయి

 


నమస్తే మానుకోట న్యూస్ నర్సింహులపేట

 

జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి కళావతి భాయి  జిల్లా కలెక్టర్ మహబూబాబాద్ ఆదేశానుసారము దంతాలపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను సందర్శించారు. 

ఈరోజు పలు దినపత్రికలలో  వచ్చిన వార్త గ్లూకోస్ బాటిల్ లో ఫంగస్ ప్రతికుల వార్తలపై దర్యాప్తు చేయడం జరిగిందని ఇందులో భాగంగా దంతాలపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి  ఈ నెల 5వ తారీకు రోజు దాట్ల గ్రామానికి చెందిన నరికట్ల సునీత w/o మనోజ్ కు 2 గ్లూకోజ్  బాటిల్స్ ఇవ్వడం జరిగిందన్నారు. ఇందులో   ఒకటి RL,  మరొకటి NS.  నిన్న అనగా 12-04-2024 వినియోగించుకోవడానికి సిద్ధమయ్యారని తీసి పరీక్షించగా  RL నాచు ఫంగస్ ఉన్నట్లుగా గుర్తించడం జరిగిందన్నారు.

ఇట్టి విషయాన్ని మనోజ్ పలు పత్రికల వారికి చెప్పడం జరిగిందని. కానీ నిజానికి ఈ ఆర్ ఎల్ బాటిల్  ప్రాథమిక ఆరోగ్య కేంద్రం దంతాలపల్లి ద్వారా ఇచ్చినది కాదు ఈ బ్యాచ్ నెంబరు ప్రభుత్వం ద్వారా సప్లై చేసినది కాదని నిర్ధారణ చేయడం జరిగిందన్నారు. అలాగే ఈ RL బాటిల్ పగిలి ఉండడం ద్వారా ఫంగస్ వచ్చిందన్నారు.

ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి శ్రీమతి కళావతి భాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం దంతాలపల్లి లోని పలు రికార్డులను పరిశీలించారు. సిబ్బంది తగిన సూచనలు ఇవ్వడం జరిగింది. సిబ్బందిపై విధులలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే తగిన చర్యలు తీసుకోబడునని హెచ్చరించారు.

పై విచారణలో భాగంగా జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి వెంట ఏ. అంబరీష, డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ,మహబూబాబాద్, డాక్టర్ చైతన్య, వైద్యాధికారి బాలాజీ,సిహెచ్ఓ, మంగమ్మ, పిహెచ్ఎన్,తదితరులు  పాల్గొన్నారు.



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.