◆గుండంరాజుపల్లి గ్రామపంచాయతీ సిబ్బంది పనితీరు అభినందనీయం.
◆చివరి ఇంటి వరకు నీటి సరఫరా అందించేందుకు గ్రామపంచాయతీ సిబ్బంది యత్నం.
◆మండే ఎండను సైతం లెక్కచేయకుండా పనిచేస్తున్న సిబ్బంది.
◆9నెలలుగా జీతాలు లేకపోయినా నిరుత్సాహ పడకుండా పనిచేస్తున్న సిబ్బంది.
◆స్థానికుల నుంచి అభినందనలు అందుకుంటున్న సిబ్బంది.
(నమస్తే మానుకోట న్యూస్-చిన్నగూడూరు)
మహబూబాబాద్ జిల్లా చిన్నగూడురు మండలానికి చెందిన గుండంరాజుపల్లి గ్రామంలోని ప్రతి ఇంటికి నీటి సరఫరా చేయడమే లక్ష్యంగా గ్రామపంచాయతీ సిబ్బంది కృషి చేస్తుందని పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్ అన్నారు.మరికొన్ని రోజుల్లో గ్రామంలో కాటమయ్య పండుగ నిర్వహించనున్న నేపథ్యంలో ప్రజలకు నీటి సమస్య ఎదురు కాకుండా చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎండను సైతం లెక్కచేయకుండా అన్ని ఇండ్లకు నీటి సరఫరా చేయడమే లక్ష్యంగా పనిచేస్తూ అందరి అభినందనలు అందుకుంటున్నారు. దొంతువారి వాడలోని నీటి సరఫరా ప్రధాన లైనులో లోపాలు ఉండటంతో మట్టిని తవ్వి సరిదిద్దే పనులు చేపట్టారు. ఇందుకోసం రెండు రోజులుగా ఎర్రటి ఎండను సైతం లెక్కచేయకుండా పనులు చేస్తున్నారు. గ్రామపంచాయతీ సిబ్బంది స్ఫూర్తిని గ్రామస్తులు అందరూ అభినందిస్తున్నారు.ఈ కార్యక్రమంలో కారోబార్ సత్యహరి,సిబ్బంది షేక్ బాష ,దుబ్బ మహేందర్ ,ఉపేంద్ర ,మంగమ్మ తదితరులు పాల్గొన్నారు.

