నమస్తే మానుకోట న్యూస్ మహబూబాబాద్
మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రంనాథ్ కేకన్ ఆధ్వర్యంలో అడిషనల్ ఎస్పీ జోగుల చెన్నయ్య నేతృత్వం లో మహబూబాబాద్ సబ్ డివిజన్ పోలీస్ టీం VS తొర్రుర్ సబ్ డివిజన్ ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ ఆడటం జరిగింది.
ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతు మానసికంగా శారీరకంగా ఉల్లాసంగా ఉండటానికి క్రీడాలి ఎంతగానో ఉపయోగపడతాయాన్ని అన్నారు.పోలీస్ ఉద్యోగం ఎన్నో సవాళ్ళను కూడుకున్నదని తమ కర్తవ్యం నిర్వహణ లో భాగంగా రేయింబవళ్ళు పని చేయాల్సి ఉంటుందని అన్నారు. ఇలాంటి క్రీడలు మన నిత్య జీవితంలో భాగంగా చేసుకుంటే మానసికంగా దృడంగా మారి రెట్టింపు ఉత్సాహంతో పని చేసే అవకాశం ఉందని అన్నారు.
తొర్రుర్ మరియు మహబూబాబాద్ సబ్ డివిజన్స్ మధ్య జరిగిన పోటీ లో మహబూబాబాద్ సబ్ డివిజన్ 12 ఓవర్లకు 90 పరుగులు తీయగా, తొర్రుర్ జట్టు 91 పరుగులు తీసి విజయం సాధించింది.


