స్వయం పరిపాలన దినోత్సవాన్ని నర్సింహులపేట మండలంలోని జయపురం గ్రామ ప్రాథమిక పాఠశాలలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో 24 మంది విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి తమ సహచర విద్యార్థులకు చక్కగా పాఠాలు బోధించారు DEO గా K యశ్వంత్, MEO గా B సుజాత, HM గా B శిరీష ఉపాధ్యాయులుగా సంఘవి, నందిని, ఐయిషా, అనిత, రాం చరణ్, ప్రణిత్, ప్రేమ్ దాస్, ప్రశాంత్ మిగతా విద్యార్థులు వ్యవహరించి తమ అనుభవాలను పంచుకున్నారునూతన ఉపాధ్యాయ బృందం మాట్లాడుతూ అన్ని వృత్తులలో కెల్లా ఉపాధ్యాయ వృత్తి గొప్పదని మేము ఒక్క రోజు తోటి విద్యార్థులకు పాఠాలు బోధించిడం ఎంతో కష్టమనిపించింది అని అన్నారు మాకు రోజు పాఠాలు బోధించే ఉపాధ్యాయులు ఎంత కష్టపడి ఒకరోజు ముందుగానే వారు ప్రిపేరై మాకు పాఠాలు అర్థమయ్యే రీతిలో బోధిస్తున్న ఉపాధ్యాయులకు రుణపడి ఉంటామని అన్నారు అనంతరం జరిగిన సమావేశంలో హెచ్ యం రాగిణి మాట్లాడుతూ ఉపాధ్యాయ పాత్ర క్లిష్టమైనదని, సమాజ అభివృద్ధికి కీలకమని, విద్యార్థులు ఈ కార్యక్రమం ద్వారా ఉపాధ్యాయ వృత్తి గొప్పదనాన్ని తెలుసుకున్నారన్నారు.విద్య అనేది ప్రతి మనిషికి ఒక గొప్ప ఆయుధం అని దాన్ని మనం ఎలా మలుచుకుంటే అలా మనల్ని మన జీవితాన్ని తయారు చేస్తుందన్నారు విద్యార్థులు క్రమశిక్షణతో చదివి నైతిక విలువలతో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని, కన్న తల్లిదండ్రులకు చదువు చెప్పిన గురువులకు పేరు తేవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో SMC చైర్మన్ రావుల శ్రీనివాస్, రిటైర్మెంట్ ఉపాధ్యాయులు నెలకుర్తి వీరారెడ్డి, చెన్నారెడ్డి, శేఖర్, ఉపాధ్యాయ బృందం గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు



