Type Here to Get Search Results !

ఆ..మంత్రి బహిరంగ క్షమాపణలు చెప్పాలి-మహిళ కన్వీనర్ జినక సువార్త.

ఆర్.ఎస్.పి  పై అనుచిత వ్యాఖ్యలు సరికావు.

(నమస్తే మానుకోట న్యూస్ -మరిపెడ)

బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండ సురేఖ బహిరంగ క్షమాపణ చెప్పాలని బిఎస్పీ డోర్నకల్ అసెంబ్లీ మహిళ కన్వీనర్ జినక సువార్త డిమాండ్ చేశారు.గురువారం మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని అబ్బాయిపాలెం గ్రామంలో ఏర్పాటు చేసిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్ జిల్లాలో రౌడీయిజం పుట్టిందే కొండ మురళి,సురేఖ కుటుంబం నుండని,వారి రౌడీ యిజానికి ఎంతోమంది అమాయకులు బలైన సందర్భాన్ని మరిచిపోయి మాట్లాడటం సిగ్గుచేటని, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని కబర్దార్  కొండ సురేఖ అని ఆమె హెచ్చరించారు.అటవీ ,పర్యావరణ మరియు దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి  కొండా సురేఖ  ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై అహంకార పూరితంగా  నిన్న ఒక సందర్భంలో  మాట్లాడటం సరికాదని , బహుజన్ సమాజ్ పార్టీ రౌడీల పార్టీ,  గుండాల పార్టీ అని పేర్కొన్నారని , ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక రౌడీల అసాంఘిక శక్తులను పెంచి పోషిస్తున్నారని అభ్యంతరకర పదజాలంతో దూషించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లుగా తెలిపారు. బహుజన నాయకుడు మచ్చలేని మనిషి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి గొప్ప నాయకునిపై అవాకులు, చావాకులు మాట్లాడేముందు మీ గతం గుర్తుకు తెచ్చుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో బిఎస్పీ గ్రామ మహిళ నాయకులు జినక లక్ష్మి, జినక శాంతమ్మ, జినక పార్వతి, తీగల పూలమ్మ, డప్పుకాటి రమణ, జిన్న సుభద్ర, నందిపాటి బుచ్చమ్మ, కొండ్రు మల్లమ్మ, జినక చంద్రమ్మ, బీరోల్ వెంకటమ్మ, జినక మైసమ్మ, జినక ఎల్లమ్మ, శ్రీదేవి, పద్మమ్మ, ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.